Politics

పార్టీ మారుతున్న జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌!

సీబీఐ మాజీ జేడీ జ‌న‌సేనానికి షాకివ్వ‌బోతున్నారా?. మున‌గిపోతున్న జ‌న‌సేనలో వుండ‌లేక బ‌య‌టికి వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారా? అంటే ఏపీ రాజ‌కీయ వ‌ర్గాలు నిజ‌మే అనే సంకేతాల్ని అందిస్తున్నాయి. వైసీపీ అధినేత‌, ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆర్థిక నేరాల కార‌ణంగా వెలుగులోకి వ‌చ్చిన పేరు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌. క్రీయాశీ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాల‌ని, గ్రామ స్వ‌రాజ్యమే నా స్వ‌ప్నం అని రాజ‌కీయాల్లోకి ఎంట‌ర‌య్యారు. జ‌న‌సేన‌లో చేరిన ఆయ‌న ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైజాగ్ నుంచి జ‌న‌సేన త‌రుపున ఎంపీగా పోటీ చేసి ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత అసంతృప్తితోనే వున్న ఆయ‌న త్వ‌ర‌లో పార్టీ మారాల‌నుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.జేడీ నిజాయితీ న‌చ్చి తొలుత లోక్‌స‌త్తా ప‌గ్గాలు ఆయ‌న‌కే అప్ప‌గిస్తాన‌ని, పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటాన‌ని అప్ప‌ట్లో జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ ఆఫ‌ర్ ఇచ్చినా జేడీ లోక్‌స‌త్తాలో చేర‌డానికి సుముఖ‌త చూపించ‌లేదు. ఆ త‌రువాత టీడీపీ ఆయ‌ప‌కు ఆఫ‌ర్ ఇచ్చింది. వైసీపీ వ‌ర్గాలు విమ‌ర్శ‌లు చేయ‌డంతో ఆ వైపు వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డ‌ని జేడీ చివ‌రి క్ష‌ణంలో జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే అక్క‌డ కూడా ఆయ‌న వుండ‌లేక‌పోతున్నార‌ని, బీజేపీలోకి వెళ్లాల‌నే ఆలోచ‌న‌లో వున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది. జేడీ చేరితే ఏపీలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసే అవ‌కాశం వుంటుంద‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ విష‌యంలో జేడీ క్లారిటీ ఇస్తే కానీ ఆయ‌న పార్టీ మారుతున్నారా? లేదా అనే విష‌యంలో క్లారిటీ రాదని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *