Politics

వైసీపీని నమ్ముకున్న వ్యక్తికి కీలక పదవి అప్పచెబుతున్న జగన్..!

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలన్ని ఒకదాని తరువాత ఒకటి నెరవేర్చే పనిలో నిమగ్నమయ్యారు. అయితే తన తండ్రి ఎలాగైతే పార్టీనీ నమ్ముకున్ని పనిచేసిన వారందరికి అందరికి సముచిత స్థానం కల్పించారో ప్రస్తుతం జగన్ కూడా అదే బాటలో నడవబోతున్నారు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడిగా కేవీపీ రామ‌చంద్ర‌రావును నియమించారు. అయితే కేవీపీ ఆ పదవిని ఎంతో బాధ్యాతాయుతంగా నిర్వహించారు. అయితే ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో ఆ కీలక పదవికి ఎవరిని నియమిస్తారు అనేది ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చానీయాంశంగా మారింది. అయితే సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్‌గా, జర్నలిస్ట్ భావంతో సాక్షి ఛానల్ ద్వారా పార్టీనీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేలా చేశాడు. అంతేకాదు గత తొమ్మిదేళ్ళుగా పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన వంతుగా పార్టీనీ ముందుండి నడిపిస్తూ జగన్‌కు తనదైన సలహాలు అందచేస్తూ వచ్చారు. ఈ సారి ఎన్నికలలో కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసి వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోశించాడు సజ్జల రామకృష్ణా రెడ్డి. అయితే పార్టీపై, పబ్లిక్ వ్యవహారాలపై చాలా అవగాహన కలిగిన వ్యక్తి సజ్జల కావడంతో ప‌బ్లిక్ ఎఫైర్స్ విషయంలో ప్రభుత్వ సలహాదారుడిగా సజ్జల తీసుకోవాలని జగన్ భావిస్తున్నారట. అంతేకాదు త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు సమాచారాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *