Cinema

మరోసారి వేదికపై నోరు జారిన అలీ.. బూతు కామెంట్స్..?

కమెడీయన్ అలీ గురించి తెలియనివారు ఉండరు . నిక్కర్లు వేసుకునే రోజుల నుంచి ఆయన సినీప్రస్థానం తెలుగువారి ముఖాల్లో నవ్వులు పూయించింది . సుదీర్ఘకాలం ఆయన హాస్యనటుడుగా అలరిస్తున్నారు . వెండితెరపైనే కాదు .. బుల్లి తెరపైనా ఆయన హాస్యవల్లరి కొనసాగుతూనే ఉంది .ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడం , ఆపన్నులకు సాయం చేయడం ఆలీకి అలవాటు . కానీ దాని గురించి ఆయన ఎప్పుడూ చెప్పుకోరట .ఇలాంటి దాతృత్వ కార్యక్రమాల కోసం తన తండ్రి పేరిట రాజమండ్రిలో ఓ ఛారిటబుల్ ట్రస్టు కూడా ఏర్పాటు చేశాడట . ఆ సమయంలోనే తన జీవితంలో అద్భుతం జరిగిందంటారు అలీ . అలా తండ్రి పేరిట సేవా ట్రస్టు ఏర్పాటు చేసి నెల తిరగకుండానే తనకు కొడుకు జన్మించాడని ఆలీ మురిసిపోతుంటారు .అందుకే మనం ఎవరికైనా సాయం చేస్తే .. దేవుడు మనకు సాయం చేస్తాడని తాను నమ్ముతానని అలీ అంటున్నారు . అలీ 1994 లో వివాహం చేసుకున్నారు . ఆ తర్వాత ఆయనకు మొదట ఓ పాప , ఆ తర్వాత బాబు … మళ్లీ ఓ పాప జన్మించారు . అలీ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుందాం .కమెడీయన్ అలీకి నోటి దూల కాస్త ఎక్కువనే చెప్పాలి. సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ ఫంక్షన్స్ లో కాస్త విరివిగా మాట్లాడుతూ ఎక్కడో ఓ చోట నోరు జారుతుంటాడు. గతంలో సమంత వీపుపైనా.. అనుష్క తొడలపైనా కామెంట్లు చేసి వివాదాస్పదమయ్యాడు.తాజాగా మరోసారి అలీ అదే పని చేశాడు. లవర్స్ డే ప్రీ రిలీజ్‌ వేడుకలో అలీ చేసిన కామెంట్స్ కలకలం సృష్టిస్తున్నాయి. యాంకర్ సుమతో అలీ యాంకరింగ్ చేశాడంటే వేదికపై నవ్వులు పూయాల్సిందే.వీరిద్దరి కాంబినేషన్ గతంలో చాలా క్లిక్కయ్యింది. మళ్లీ లవర్స్ డే ప్రీ రిలీజ్‌లోనూ వీరిద్దరూ స్టేజ్ పై సందడి చేశారు. అలీ తన నోటికొచ్చినట్టి మాట్లాడి సుమను ట్రాన్స్ లేషన్ చేయమన్నాడు. అలీ మాట్లాడిన దానిని సుమ అనువదిస్తూ ప్రియావారియర్ ఇక్కడున్న వారి అందరికీ చెల్లి అవుతుందన్నది.అలీని ఉడికిస్తూ అలీకి కూడా ప్రియావారియర్ చెల్లే అవుతందన్నది సుమ. దీనికి అలీ సెటైర్‌గా మరి రోషన్ నీకు కొడుకు అవుతాడా అన్నాడు. దానికి సుమ అవును కొడుకే అవుతాడంది. అంతే ఆలీ చెలరేగిపోయాడు. మరి రాజీవ్ కనకాల కేరళ ఎప్పుడు వెళ్లాడు అంటూ డబుల్ మీనింగ్ బాంబ్ పేల్చాడు. పాపం వేదికపైనున్న మళయాళీ కుర్రాడు రోషన్‌కు తెలుగు రాదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత పెద్ద గొడవ అయ్యేదో కదా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *