Politics

టీడీపీలోకి అలీ… చంద్ర‌బాబు అదిరిపోయే ఆఫ‌ర్‌

ఏపీ రాజకీయాల్లో సినీ నటుడు, కమెడియన్ ఆలీ గత కొంతకాలంగా సెన్సేషన్ సృష్టిస్తున్నారు. ఆలీ ఏ పార్టీలో చేరుతారో అర్థం కాక రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఏపీ లోని ప్రధాన పార్టీల అధినేతలను ముగ్గురిని కలిసిన ఆలీ తన డిమాండ్ వారి ముందు ఉంచారు.వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్న ఆలీకి చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. గత నెలలో వైసిపి అధినేత ను కలిసి రాజకీయ ఆరంగేట్రంపై మంతనాలు జరిపారు. ఇక ఆలీ జగన్ ను కలవడంతో అందరూ ఆలీ వైసీపీలో చేరుతారని భావించారు. ఇక ఆయన చేరికకు ముహూర్తం కూడా ఖరారైంది అంటూ పాదయాత్ర చివరి రోజున ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆయన వైసీపీలో చేరలేదు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసిన ఆలీ పవన్ తో మంతనాలు జరిపారు.ఇక పవన్ కళ్యాణ్ ఆలీకి ఆశించిన స్థానం నుండి టిక్కెట్ ఇస్తానని జనసేన లోనే ఉండాలని కోరారు.

అయినా ఆలీ జనసేన లోను చేరలేదు. ఆ తర్వాత వెంటనే టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ని కలిసిన ఆలి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న తన ఆకాంక్షను తెలిపారు. గత ఎన్నికల్లోనే టిడిపి నుండి గుంటూరు టికెట్ ఆశించిన ఆలీ అప్పటి పరిస్థితుల నేపథ్యంలో పోటీ చేయలేదు. మొదటి నుండి టీడీపీకి సన్నిహితంగా ఉండాలి ఈసారి కూడా టిడిపి నుండి టిక్కెట్ ఆశించారు. ఇటీవల కలిసినప్పుడు ఆలీ తన మనసులోని కోరికను చంద్రబాబు నాయుడు కి చెప్పారు. ఆ తర్వాత విశాఖపట్నంలో మంత్రి గంటా శ్రీనివాస రావు ని కలిసి ఆలీ మంతనాలు జరిపారు. ఒక గంట శ్రీనివాస రావు తన పక్షాన చంద్రబాబుతో మాట్లాడతారు అని ఆలీ చెప్పారు. ఇక తాజాగా ఆదివారం రోజు మళ్లీ ఒకమారు చంద్రబాబు నాయుడు కలిసిన ఆలీ టీడీపీలో చేరిక పై చంద్రబాబు నాయుడుతో దాదాపు 20 నిమిషాలకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపారు.

ఇక చంద్రబాబు నుండి హామీ రావడంతో ఆలీ వైసిపికి, జనసేన కు షాక్ ఇస్తూ టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గుంటూరు నుండి టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆలీకి గుంటూరు నుండి బరిలో దిగడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టిక్కెట్ ఇవ్వనున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీంతో రేపు మాపో మంచి రోజు చూసుకొని ఆలీ టీడీపీలో చేరనున్నారు. ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ టిడిపి అని భావిస్తున్న ఆలీ, అత్యంత సన్నిహితుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గుంటూరు నుండి టికెట్ ఇస్తానన్నా , జగన్ సైతం ఆలీ చేరికపై సానుకూలంగా ఉన్న ఆ రెండు పార్టీలను కాదని టీడీపీలో చేరడానికి రెడీ అయిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *