Cinema

ఎమ్మెల్యేగా బరిలోకి అనసూయ…!

జబర్దస్త్ లో హాట్ యాంకర్ గా అదరగొట్టిన అనసూయ అతి తక్కువ కాలంలోనే వెండితెర మీద తనకంటూ గుర్తింపుని తెచ్చుకుంది. ఐటెం సాంగ్స్ లో అదరగొడుతూ.. రంగస్థలంలో రంగమ్మత్తగా తన టాలెంట్ ని బయటపెట్టిన అనసూయ క్షణం సినిమాలో నెగెటివ్ పోలీస్ ఆఫీసర్ గా ఇరగదీసింది. ఇక తాజాగా ఎఫ్ 2లో అదరగొట్టే ఐటెంలో రెచ్చిపోయిన ఈ హాట్ యాంకర్ విడుదలకు సిద్ధమవుతున్న యాత్ర సినిమాలో ఒక కీలకపాత్రలో నటించింది. ఒక వైపున బుల్లితెరపై సందడి చేస్తూనే మరో వైపున వెండి తెరపై అల్లరి చేస్తూ అనసూయ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. యాంకర్ అనసూయ ఎమ్మెల్యేగ ఎంట్రీ ఇవ్వనుంది. రాజకీయాల్లో కాదు సుమా.. ఓ సినిమాలో ఎమ్మెల్యేగ బరిలోకి దిగనుంది. జబర్దస్త్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ ఇటీవల సినిమాల్లో కూడా ప్రాముఖ్యమున్న పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో ఇప్పటికే నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఆమె ‘యాత్ర’ బయోపిక్‌లో కర్నూల్ ఎమ్మెల్యే చరితారెడ్డి పాత్రలో నటిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పాదయాత్ర సమయంలో 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున నందికొట్కూరు నియోజకవర్గం నుంచి గౌరు చరితారెడ్డి పోటీచేసి ఏవిధంగా గెలిచారు, పార్టీకోసం ఆమె కష్టపడిన తీరును ఈ సినిమాలో చూపించనున్నారు. అనసూయ పూర్తిగా డీగ్లామర్‌గా కనిపించనుంది. ఫిబ్రవరి 8న తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *