Cinema

బ్రహ్మానందం పరిస్థితి విషమం – ఈ పరిస్థితి రావటానికి కారణం ఏమిటో తెలుసా?

ఎన్నో సినిమాల్లో తన హాస్యంతో కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా ఇటీవల బ్రహ్మి సినిమాలు కూడా బాగా తగ్గించారు. టివి షోలో చేస్తున్నారు. ముఖంలో కూడా తేడా వచ్చేయడంతో కామెడీ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేక పోతున్నారు. ఇక ఆదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడం, విషమంగా మారడంతో హుటాహుటిన ముంబయిలోని ఏహెచ్ఐ (ఏషియన్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌)కు తరలించారు.ఏహెచ్ఐ వైద్యులు పరీక్షలు నిర్వహించి, గుండెకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. లేకుంటే ప్రమాదమని వైద్యులు స్పష్టం చేసారు.

దీంతో బ్రహ్మానందం కుటుంబ సభ్యులు ఆపరేషన్ కి అంగీకారం తెలియజేస్తూ, డాక్యుమెంట్స్ పై సంతకాలు పెట్టారు. దీంతో ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు రమాకాంత్ పాండా ఆధ్వర్యంలో సోమవారం బ్రహ్మానందానికి శస్త్రచికిత్స నిర్వహించారు.ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. బ్రహ్మానందం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో ఆయన వద్ద కుమారులు గౌతమ్,సిద్దార్ధ వున్నారు. బ్రహ్మానందం గతంలో తీవ్ర అనారోగ్యానికి గురై,చావు అంచుల దాకా వెళ్ళివచ్చినట్లు ప్రచారం జరిగింది. అందుకే అప్పటినుంచి సినిమాల్లో పెద్ద గా కనిపించకుండా టివి షోకి పరిమితం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కి ఎప్పుడైనా మనసు ఉల్లాసంగా లేకపోతె బ్రహ్మానందాన్ని ఇంటికి ఆహ్వానించి ,సరదాగా జోకులతో గడుపుతారు.ఇలా ఇండస్ట్రీలో చాలామంది ఆప్తులు బ్రహ్మానందానికి ఉన్నారు. అందుకే బ్రహ్మానందాన్ని ముంబయ్ తరలించారని తెల్సి టాలీవుడ్ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *