Cinema

బ్రోచేవారెవరురా మూవీ రివ్యూ…

సినిమా : బ్రోచేవారెవరురా
నిర్మాత :విజ‌య్ కుమార్ మ‌న్యం
సంగీతం : వివేక్ సాగ‌ర్‌
దర్శకత్వం : వివేక్ ఆత్రేయ‌
ఎడిటర్ : రవితేజ గిరిజాల‌
హీరో : శ్రీ విష్ణు
హీరోయిన్ : నివేదా థామ‌స్‌
నటీనటులు : ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌,స‌త్య‌దేవ్‌, నివేతా పెతురాజ్‌

వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో వచ్చిన చిత్రం బ్రోచేవారెవరురా శ్రీ విష్ణు కధా నాయకుడిగా నివేదా థామ‌స్‌ కథానాయకిగా కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంది.
కామెడీ ని సినిమా లో మెయిన్ కంటెంట్ గా తీసుకెళ్ళినప్పటికీ అక్కడ అక్కడ సినిమా చాలా నెమ్మిదిగా సాగింది అనే చెప్పుకోవాలి , ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌ తో కలసి శ్రీ విష్ణు సినిమా ని ముందుకు తీసుకువెళ్లాడు అని చెప్పాలి. మంచి చెయ్యాలనే ఉద్దేశం తో ముగ్గురు కుర్రాళ్ళు అనుకోని పరిస్థితులు వాళ్ళ సమస్యల్లోకి చిక్కుకుని వాటి నుంచి బయట పడే సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పుకోవాలి, సినిమా లో చిన్న పిల్ల బ్యాగ్ కోసం చేసిన అల్లరి కూడా మెయిన్ పాయింట్ గా చెప్పాలి. ఇంక ఎప్పటిలాగే రాహుల్ మరియు ప్రియదర్శి వాళ్ళ కామెడీ టైమింగ్ తో అలరించారు ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లో వచ్చే ఛేగింగ్ సీన్ లో మంచి కామెడీ టైమింగ్ తో హైలెట్ గా సాగింది ఆ సీన్ , ఇంక నివేదా థామ‌స్‌ తన అందాలతో మరియు నటనతో ప్రేక్షకుల అందరిని తన వైపు తిప్పేసుకుంది, నివేదా థామ‌స్‌ కి వాళ్ళ తండ్రికి మధ్య సన్నివేశాలు కూడా చాల బాగా అలరించాయి.
మొత్తం గా ఈ సినిమా ప్రేక్షకులకు మంచి కామెడి క్రైమ్ థ్రిలర్ గా నవ్వుల వర్షం థియేటర్స్ లో కురిపిస్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *