Politics

మాజీ జేడీ లక్ష్మి నారాయణ సంచలన నిర్ణయం.. ఆ పార్టీలోకి ఎంట్రీ …

సి.బి.ఐ మాజీ c సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా? లేక ఏదైనా పార్టీలో చేరి కీలక పాత్ర పోషించబోతున్నారా అనేది రాజకీయ వర్గాల్లో ఎప్పటినుండో జరుగుతున్న చర్చ. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోసీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ప్రజల్లో ఇంకా జోరుగా చర్చ సాగుతోంది. ఇక గతంలో బీజేపీ నే ఆయనను రాజకీయాల్లోకి పంపించింది అని కొంతకాలం ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన జనసేన బీజేపీ పార్టీల్లో చేరబోతున్నారు అంటూ… పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక టిడిపిలో సైతం ఆయన చేరే అవకాశం ఉందంటూ రకరకాల వార్తలు ప్రచారమయ్యాయి. అంతేకాదు జయప్రకాష్ నారాయణ ప్రారంభించిన లోక్ సత్తా పార్టీకి కూడా ఆయనకు ఆఫర్ వచ్చింది.

అయితే మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ పార్టీల్లో ఏదో ఒక పార్టీలోచేరడం ఖాయం అని ఆయనకు మరో ఆప్షన్ లేదు అని అంతా భావించారు. అయితే లోక్ సత్తా పార్టీలో సైతం తాను చేరబోనని కొత్త పార్టీని పెట్టబోతున్నానని లక్ష్మీనారాయణ చెప్పినట్లుగా తెలుస్తోంది. కానీ తరువాత ఏమైందో ఏమో కానీ ఆయన బాగా సైలెంట్ అయిపోయారు. ఇక ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రధాన పార్టీల్లో రసవత్తర రాజకీయాలు నెలకొంటే అసలు జేడీ రాజకీయాల్లో ఉంటారా లేదా అన్న దానిపై కూడా పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.ఇక ప్రస్తుతం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరబోతున్నారని సమాచారం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, జేడీ లక్ష్మీనారాయణ ను కలిసి పనిచేద్దామని కోరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జేడీ లక్ష్మీనారాయణ తో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారని, సొంతంగా పార్టీ పెట్టడం బదులుగా జనసేన లో చేరి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కోరినట్లుగా తెలుస్తోంది. సొంత పార్టీ వల్ల జేడికి ఈ సమయంలో ఎలాంటి ఉపయోగం ఉండదని జనసేన పార్టీలో సముచిత స్థానం ఇస్తామని పవన్ కళ్యాణ్ కోరినట్టుగా తెలుస్తోంది. ఇక జేడి ఆశయాలు, తన ఆశయాలు ఒకేలా ఉన్నాయని, భావసారూప్యత కలిగిన ఇద్దరమూ కలిసి పనిచేస్తే బావుంటుందని చెప్పి జనసేన అని జేడీని ఒప్పించినట్లు గా తెలుస్తోంది.

జేడీకి ఏపీ లో ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆయనను పార్టీలో చేర్చుకుంటే పార్టీ ఇమేజ్ కూడా పెరుగుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే తమ పార్టీలో చేరి ప్రజా సేవ చేయాలని పవన్ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది.రాజకీయాల్లోకి రానున్న నేపథ్యంలోనే జేడీ లక్ష్మీనారాయణ ఏపీ లోని ప్రతి జిల్లాలోనూ పర్యటించి ప్రజాసమస్యలను తెలుసుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ అన్ని వర్గాలను కలుసుకున్న జేడీ ప్రజా క్షేత్రంలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. సిబిఐ మాజీ డైరెక్టర్ గా పనిచేసిన సందర్భంలోనే జగన్ అక్రమాస్తుల కేసు, సత్యం కంప్యూటర్స్ కేసు, గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులో వ్యవహారంలో అత్యంత కీలకంగా వ్యవహరించి, ఎలాంటి ఒత్తిడిలకు తలవకుండా ఒక నిజాయితీ గల ఆఫీసర్ గా అందరి మన్ననలు పొందిన లక్ష్మీనారాయణ రాష్ట్రంలోని అనేకమంది మేధావులు, విద్యార్థులు, రైతులకు బాసటగా నిలిచారు. వారందరి ఆదరాభిమానాలను చూరగొన్న ఆఫీసర్ గా గుర్తించబడ్డారు. ఇక ఆయన ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయాలని సంకల్పించి ఉద్యోగానికి రాజీనామా చేసి ఏపీ ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. సంవత్సర కాలంగా ప్రతి జిల్లా తిరిగిన ఆయన ప్రతి జిల్లాలోనూ ప్రజల సమస్యలను తెలుసుకోగలిగారు. వారి కోసం ఏం చేయాలో ఒక అవగాహనకు రాగలిగారు. ఇక ఈ నేపథ్యంలోనే జనసేనాని ఇప్పటికే లక్ష్మి నారాయణ ఏపీలో అనేక ప్రాంతాల్లో పర్యటనలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా అనేకమంది మేధావులు, విద్యార్థులు, రైతులు ఇలా అనేక వర్గాల ప్రజలను కలుసుకున్నారు.

తనకంటూ ఒక గుర్తింపు… గౌరవం సంపాదించుకున్నారు. అప్పట్లో ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్‌రెడ్డి మైనింగ్‌ కేసుల వ్యవహారంతో పాటు సత్యం కంప్యూటర్స్ కేసు అప్పటి సీబీఐ జెడి లక్ష్మీనారాయణ అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అసలు ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంటనే ఆయన జనసేనలో చేరబోతున్నాడు అంటూ మొదట్లోనే ప్రచారం జరిగింది జేడీని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు గా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అటు జనసేన కానీ లక్ష్మీనారాయణ కానీ స్పందించలేదు. ప్రస్తుతం పవన్ తో జరిగిన చర్చల నేపథ్యంలో త్వరలోనే ఆయన జనసేనలో చేరే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి జేడీ కనుక జనసేన పార్టీలో చేరితే జనసేన పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉంది. మరి జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరుతారో లేదో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *