Politics

వైసీపీ జై కొట్టిన మ‌రో సినీ ప్ర‌ముఖుడు..!

ఏపీ వ్యాప్తంగా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల త‌రువాత వెలువ‌డే ఫలితాలు వైసీపీ గెల‌వబోతుంద‌ని, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేరు ముంద‌ర ముఖ్య‌మంత్రి అన్న ప‌దం చేర‌బోతుంది. అంతేకాదు, జ‌గ‌న్‌ను ఏపీ ప్ర‌జ‌లు ముఖ్య‌మంత్రి చేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను కూడా నేను చెప్ప‌గ‌ల‌ను అంటూ టాలీవుడ్ ర‌చ‌యిత చిన్ని కృష్ణ అన్నారు.కాగా, ఇవాళ హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల త‌న కార్యాల‌యంలో చిన్ని కృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో జ‌గ‌న్ చూపిన పోరాట ప‌టిమ‌, ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉండే వ్య‌క్తి, మాట త‌ప్ప‌ని నైజం, ప్ర‌జ‌ల‌కు ఇచ్చే హామీ ప‌త్రాలను చెత్త‌కుప్పల్లో కాకుండా, తాన శ్వాస‌లో ఉంచుకునే వ్యక్తి వైఎస్ జ‌గ‌న్‌.

ఇచ్చిన ప్ర‌తీ హామీని నెర‌వేరుస్తాడ‌న్న న‌మ్మ‌కం ఏపీ ప్ర‌జ‌ల‌కు వైఎస్ జ‌గ‌న్‌పై ఉంది. అందుకే ఆయ‌న్ను ముఖ్య‌మంత్రిని చేసేందుకు ఏపీ ప్ర‌జ‌లు ఉవ్విళ్లూరుతున్నార‌ని టాలీవుడ్ సినీ నిర్మాత చిన్ని కృష్ణ అన్నారు.ఏపీకి కాబోయే సీఎం జ‌గ‌నేనంటూ ఇటీవ‌ల విడుద‌లైన స‌ర్వేలు సైతం తేల్చేశాయ‌ని, దాంతో జ‌గ‌న్‌ను సీఎం కాకుండా నిలువ‌రించేందుకు టీడీపీ, కాంగ్రెస్, జ‌న‌సేన పార్టీలు స‌ర్వ‌శ‌క్తులా త‌మ త‌మ ప్ర‌య‌త్నాల‌ను చేస్తున్నాయ‌న్నారు. జ‌గ‌న్‌కు ఎవ‌రెన్ని అడ్డంకులు సృష్టించినా ప్ర‌జ‌లు మాత్రం వారి నిర్ణయాన్ని మార్చుకోర‌ని, ఫ్యాన్‌కు ఓటేసి జ‌గ‌న్‌ను సీఎం చేయాల‌ని ఏపీ ప్ర‌జ‌లు ఎప్పుడో డిసైడ్ అయ్యార‌ని చిన్ని కృష్ణ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *