Cinema

జనసేన ఫిలిం ఇన్ స్టిట్యూట్! పవన్ సరికొత్త నిర్ణయం..

అదేంటి జనసేన ఏమిటి ఫిలిం ఇన్ స్టిట్యూట్ ఏమిటి, టైటిల్ ఏమైనా రాంగ్ పెట్టారా..? పొలిటికల్ పార్టీ ఒక ఫిలిం ఇన్ స్టిట్యూట్ పెట్టటం ఏమిటని మీరు అనుకోవచ్చు, కానీ మీరు చదువుతుంది అక్షరాలా నిజమే, ఎన్నికల్లో ఓటమి చెందిన అనంతరం అనేక సమీక్షలు నిర్వహించిన జనసేన అధినేత పార్టీ బలోపేతం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు గత కొద్దీ రోజులుగా మీడియాలో ప్రముఖంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైములో ఇలా ఫిలిం ఇన్ స్టిట్యూట్ అంటూ జనసేన నుండి ప్రకటన రావటం చూస్తుంటే అసలు పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు.పాలకొల్లు లో ఏర్పాటు చేయబోతున్న ఫిలిం ఇన్ స్టిట్యూట్ ను రాజా వన్నెంరెడ్డి.. బన్నీ వాసులు నిర్వహిస్తారని, హరిరామ జోగియ్య దానికి ఛైర్మన్ గా.. రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపల్ గా ఉంటారని ఈ ప్రకటనలో తెలిపారు. సరే ప్రకటన వరకు బాగానే ఉంది. ఫిలిం ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేయటాన్ని ఎవరు తప్పు పట్టలేరు, కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో పవన్ లాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేయటం కొంచం అర్ధం కానీ విషయమే అని చెప్పాలి. జనసేన పేరుకి ఉన్న బ్రాండ్ వేల్యూని ఇలా ఉపయోగించుకుంటే బాగుంటుందని భావించి ఇలాంటి ప్రకటన చేశారో,  వాళ్ళకే అర్ధం కావాలి. అయిన పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టాల్సింది పోయి, ఇలా పార్టీకి పెద్దగా అవసరం లేని వాటిని ఎందుకు తలకెత్తుకోవటం. ఇలాంటి వాటి వలన జనసేనకు జనాల్లో ఉన్న అంతో,ఇంతో అభిమానం కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *