Cinema

అల్లు అర్జున్ పై కాల్పులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై కాల్పులు జరిగాయి . కాల్పులు అనగానే నిజమైన కాల్పులు అనుకోవద్దు సుమా ! కొంటెగా కన్ను గీటే భామ ప్రియా ప్రకాష్ వారియర్ జరిపిన కొంటె కాల్పులు అన్నమాట ! మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ కొంటెగా కన్ను గీటి కాల్చిన వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . తాజాగా ఈ భామ లవర్స్ డే చిత్ర ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చింది .కాగా ఆ వేడుకకు ముఖ్య అథితిగా అల్లు అర్జున్ హాజరయ్యాడు . దాంతో అల్లు అర్జున్ మీద ఉన్న తన క్రష్ ని తెలియజేసే ఉద్దేశంతో కన్ను గీటుతూ తుపాకీలాగా తన చేతి వేళ్ళని ఎక్కుపెట్టి కాల్చింది . దాంతో అల్లు అర్జున్ కుదేలయ్యారు , ప్రియా ప్రకాష్ క్రష్ కి అల్లు అర్జున్ తెగ మెలికలు తిరిగిపోయాడు . ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘సౌత్ ఇండియా సినిమాల్లో ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన వీడియోలలో కొలవెరి డీ ఒకటి అది చాలా వైరల్ అయ్యింది. అలానే బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ట్యాగ్ బాగా వైరల్ అయ్యింది. ఆ తరువాత ‘ఒరు ఆదార్ ల‌వ్’ సినిమాలో ప్రియా ప్రకాష్ కన్నుగీటే వీడియోనే. నాకు సౌత్ ఇండియా అంటే చాలా పిచ్చి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా అన్నీ ఇష్టమే. నా ప్రొఫెషన్ ఏంటీ అంటే సౌత్ ఇండియన్ యాక్టర్ అని రాసుకుంటా.. అందులో ఎలాంటి మొహమాటం లేదు. ఇలా చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ని రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. నన్ను మలయాళం సినిమా వాళ్లు ఎంతో ఆదరించారు. నా ప్రతి సినిమాని వాళ్ల సొంత సినిమా లాగ వెల్కమ్ చెప్పారు. వాళ్ల లాంగ్వేజ్‌నుండి తెలుగులోకి ఒక సినిమా వస్తుంది కదా అని వాళ్లని ఎంకరేజ్ చేయాలనే ఈ ఆడియో వేడుకకి హాజరయ్యా. ఈ సినిమాకి ఇంత బజ్ తీసుకువచ్చిన హీరో రోషన్‌కి, ప్రియా వారియర్‌కి కంగ్రాట్స్ చెప్తున్నా. అలానే మరో కారణం చెప్పాలంటే.. నా సినిమా ‘నా పేరు సూర్య’ టైంలో వినోద్ రెడ్డి అనే నిర్మాతని పరిచయం చేశారు బన్నీ వాసు. అయితే ఈ సినిమా వల్ల నిర్మాతకు నష్టాలు వచ్చాయి. తరువాత సెటిల్ మెంట్‌ల టైంలో బన్నీ వాసు వచ్చి వినోద్ రెడ్డి సినిమా ముందు ఎలా ఉన్నారో తరువాత కూడా అలానే ఉన్నారని చెప్పారు. మనకు టైం వచ్చినప్పుడే ఆయనకు ఏమైనా చేయాలి గుర్తుపెట్టుకో అని చెప్పా. ఇప్పుడు వినోద్ రెడ్డి వచ్చి ఈ సినిమా ఫంక్షన్‌కి ఆహ్వానించారు. నా ప్రాణం ఉన్నంత వరకు ఇలాంటి వాళ్లకోసం నిలబడతా. ఈ సినిమా ఫిబ్రవరి 14 లవర్స్ డే పేరుతో తెలుగులో విడుదల కాబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *