Cinema

షూటింగ్ లో గాయపడిన భామ

ఆపిల్ బ్యూటీ హన్సిక ప్రస్తుతం తన 50వ చిత్రం మహాలో నటిస్తోంది. వివాదాస్పద ఫస్ట్ లుక్‌తోనే ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. హర్రర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హన్సిక రక్తంతో నిండిఉన్న బాత్ టబ్ లో ఉన్న పోస్టర్ కూడా ఆ మధ్యన వైరల్ అయింది. సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఈ పోస్టర్ చాలు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తికాకుండానే సినిమాపై అంచనాలు పెంచేలా ఫస్ట్ లుక్ , సెకండ్ లుక్ , తర్డ్ లుక్ లు రిలీజ్ చేసారు ఆ లుక్ లన్ని వివాదాన్ని రాజేశాయి . తాజాగా మహా చిత్రం కోసం యాక్షన్ సీన్స్ తీస్తున్న సమయంలో హన్సిక జారి కిందపడింది దాంతో చేతికి గాయాలయ్యాయి. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో హన్సిక జారి పడిందట. దీంతో ఆమెకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయాలు లెక్కచేయకుండా హన్సిక ప్రాధమిక చికిత్స తీసుకుని షూటింగ్ లో పాల్గొందట. తన 50 వ చిత్రం కావడంతో మహాని హన్సిక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. షూటింగ్ పేకప్ చెప్పాకా ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంది . హన్సిక గాయాలయ్యాయి కానీ మరీ ప్రమాదకరమైనవి కాకపోవడంతో యూనిట్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.జమీల్ ఈ చిత్రానికి దర్శకుడు తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. హన్సికకు ఇటీవల టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదు. అందుకే ఎక్కువగా తమిళ చిత్రాలపైనే దృష్టిపెట్టింది ఈ భామ. టీనేజ్ లోనే సినీ రంగ ప్రవేశం చేసిన హన్సిక పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *