Cinema

యాంకర్ అనసూయ చెల్లెలితో.. హైపర్ ఆది రోమాన్స్..?

అతి తక్కువ సమయంలో ‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. తన కామెడీ టైమింగ్, పంచ్ లతో ఆడియన్స్ ను నవ్విస్తుంటాడు. అతడి ఎపిసోడ్ కోసం షోని చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు.అంతగా ఈ షోతో పాపులర్ అయిన హైపర్ ఆది ఇప్పుడు షో నుండి బయటకి వెళ్లిపోనున్నాడా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత సినిమా అవకాశాలు రావడంతో షో నుండి చాలా మంది కమెడియన్లు తప్పుకున్నారు.ఇప్పుడు వారిలానే హైపర్ ఆదికి కూడా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. ఓ పక్క షో, మరోపక్క సినిమాలతో బిజీగా గడుపుతోన్న హైపర్ ఆది రెండు వారాలుగా షోలో కనిపించడం లేదు. దీంతో ఆది విషయంపై రకరాల చర్చలు మొదలయ్యాయి.పూర్తిస్థాయిలో సినిమాలలో నటించడానికే అతడు షో నుండి దూరమవుతున్నాడని టాక్. మరోవైపు హైపర్ ఆది ‘జనసేన’ పార్టీలో జాయిన్ అవుతాడని, ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడానికే షోకి దూరమయ్యాడని కొంతమంది వాదిస్తున్నారు. అయితే తాజా గా జరిగిన ఎపిసోడ్ లో ఆది మళ్ళీ తిరిగి షో లో ఎంట్రీ ఇచ్చాడు .. జబర్దస్త్ క్రేజ్‌ను పంచ్‌లతో పెంచేసిన హైపర్ ఆది.. స్టేజ్ పైన కామెడీతో పాటు రోమాన్స్ కూడా చేస్తున్నాడు. ఆ మధ్య కొన్ని ఎపిసోడ్లలో యాంకర్ అనసూయపై స్టేజ్‌పై రోమాన్స్ చేశాడు. అనసూయతో డ్యూయెట్లు కూడా పాడేశాడు.ఐతే.. అదంతా కామెడీలో భాగమే అనుకోండి.. కొన్నాళ్లుగా జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్న హైపర్ ఆది లేటెస్ట్ ఎపిసోడ్‌లో మళ్లీ వచ్చేశాడు. వస్తూ వస్తూనే యాంకర్ అనసూయగా షాక్ ఇచ్చేశాడు.రొటీన్‌గానే హైపర్ ఆది అనసూయతో డ్యూయట్ ట్రై చేశాడు. ఆ తర్వాత ఇదంతా కామెడీ అని అనసూయ ఉడికించడంతో.. స్టేజ్‌ పైకి ఓ కొత్త అమ్మాయిని తీసుకొచ్చేశాడు. ఆమె ఎవరో కాదు అనసూయ చెల్లెలు వైష్ణవి.. అనసూయకు బదులు అనసూయ చెల్లెలు వైష్ణవితో డ్యూయట్ పాడేశాడు హైపర్ ఆది.ఒక్కసారిగా తన చెల్లెలు జబర్దస్త్ వేదికపై కనిపించేసరికి అనసూయ షాక్ అయ్యింది. వైష్ణవి తనలా కాదు.. చాలా అమాయకురాలంటూ హైపర్ ఆదిని రిక్వెస్ట్ చేసింది. మరి మీరూ ఒకే చెప్పకుండా.. వైష్ణవిలాంటి వాళ్లను కూడా ఓకే చెప్పనీయకపోతే.. ఇక మాకు లేడీ గెటప్పులు లైనేస్తున్నారు అంటూ హైపర్ ఆది నవ్వులు పూయించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *