Sports

ఇండియా కి ఓటమి రుచి చూపిన ఇంగ్లాండ్ ….

2019 ప్రపంచ కప్ లో ఇండియా కి తొలి ఓటమిని రుచి చూపిన ఇంగ్లాండ్. భారీ పరుగుల ఆధిక్యాన్ని ఛేదించడం లో బోల్తా పడిన టీం ఇండియా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓటమి చూడక తప్పలేదు, 31 పరుగుల తేడాతో ఓటమి చెందింది. రోహిత్ శర్మ 109 బంతుల్లో 102 పరుగులు చేసి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించినప్పటికీ ఫలితం దక్కలేదు , కెప్టెన్ శ్రమించి జట్టుని ముందుకు తీసుకెళ్ళినప్పటికీ ఇంగ్లాడ్ చేసిన స్కోర్ ని తాకలేక పోయాము, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 31 బంతుల్లో 42 పరుగులు చేసి నాట్ అవుట్ బ్యాట్స్ మాన్ గా ఉన్నప్పటికీ విజయం సాధించలేక పోయింది టీం ఇండియా , ఈ విజయం తో ఇంగ్లాండ్ సెమిస్ స్థానాన్ని దాదాపు దక్కించుకున్నట్లే,
ఇంక ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే పరుగులు ఇచ్చినప్పటికీ మహమ్మద్ షమీ 10 ఓవర్లు వేయగా 69 పరుగులు ఇచ్చి 5 వికెట్స్ తీయగా, బుమ్రా 10 ఓవర్లు వేయగా 44 పరుగులు ఇచ్చి 1 వికెట్స్ తీయగా అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శించాడు, కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లు వేయగా 72 పరుగులు ఇచ్చి 1 వికెట్స్ తీసాడు, అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను మంచి ఆటను ప్రదర్శించినప్పటికీ ఓటమి తప్పలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *