Sports

ప్రపంచ కప్ లో ఓటమి ఎరుగని జట్టు టీం ఇండియా ….

2019 ప్రపంచ కప్ లో ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న ఇండియా సెమిస్ కి అతి చేరువలో ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అలాంటి ఇండియా జట్టు ఈరోజు ఆఫ్గనిస్తాన్ తో తలపడనుంది ఈ జట్టుతో విజయావకాశాలు ఎక్కువగానే ఉన్నాయ్ అని చెప్పచు. భువనేశ్వర్ స్థానం లో మహమ్మద్ షమీ ని తీసుకోవడం ఒక్కటే ఇండియా తుది జట్టులో చేయనున్న మార్పుగా తెలుస్తుంది . ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటికే రెండు సెంచరీలతో దూకుడుతో ఉన్నాడు కోహ్లీ సెంచరీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు . అయితే ఇప్పటి వరకు ఈ రెండు జట్టుల మధ్య కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే జరిగాయి అవికూడా 2014 , 2018 ఆసియా కప్ లో భాగంగానే జరగడం విశేషం ఇందులో ఇండియా ఒక మ్యాచ్ విజయం సాధించగా ఇంకో మ్యాచ్ టై గా మారింది. ఈరోజు జరగబోయే మ్యాచ్ లో విజయం ఎవరిదిశగా ఉంటుందో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *