Politics

జగన్‌కు గుడ్‌ న్యూస్..!

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌కు గుడ్ న్యూస్.. ఆయనపై నమోదైన అక్రమ ఆస్తుల కేసులో ఇద్దరు అధికారులకు ఊరట లభించింది. ఈడీ వారిపై పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఐఎఎస్ అదికారులపై కేసులు పెట్టడానికి ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పింది.ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈడి కేసులు పెట్టింది అధికారుల తరపు న్యాయమూర్తి వాదించారు. దీంతో ఆయన వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ఆ కేసులను కొట్టేశారు. ప్రభుత్వం అనుమతి తీసుకుని కేసులు పెట్టుకోవచ్చని తీర్పు ఇచ్చారు.ఈ తీర్పుతో జగన్ కు కూడా ఊరట లభించినట్టయింది. ఎందుకంటే.. జగన్ అక్రమాస్తుల కేసులో ఉన్నతస్థాయి అధికారుల నిర్ణయాల వల్లే జగన్ ఆర్థికంగా లాభపడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అలాంటిది ఐఏఎస్ అధికారులపైనే కేసులు కొట్టేసినప్పుడు జగన్ పై దీని ప్రభావం ఉంటుంది.జగన్ అక్రమాస్తుల కేసుల్లో నేరుగా జగన్ ప్రమేయం లేదు. అన్నీ పరోక్షంగా లబ్ది పొందినవే. అలాంటప్పుడు జగన్ అక్రమాలను రుజువు చేయడం చాలా కష్టం. ఇప్పుడు అదే జరుగుతోంది. దీన్నిబట్టి చూస్తే జగన్ పై కేసులు నిలబడేవి కావని తేలిపోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *