Politics

జనగణమన.. వంద ఇచ్చుకోండి..జనసేన సరికొత్త స్కీమ్ రహస్యం…

ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా పోటీచేసింది మేమే అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఆ పార్టీ తరుపున పోటీచేసిన ఎమ్మెల్యేలను అడిగితే ఎవరెంత ఖర్చుపెట్టారో లెక్కలతో సహా చెపుతారు. ఆ లెక్కలు వాళ్ళు పవన్ కళ్యాణ్ కి చెప్పలేదేమో, ఒక్క వేళ చెప్పిన ఆయన వాటిని మర్చిపోయి ఉండవచ్చులే అది వేరే విషయం. ఒక్క రాజకీయ పార్టీ మనుగడ సాధించాలంటే ఖచ్చితంగా డబ్బులు అనేవి చాలా అవసరం. అందుకోసం ఆయా పార్టీలు అనేక రూపాల్లో విరాళాలు సేకరిస్తూ ఉంటారు.జనసేన పార్టీ కూడా దానికి అతీతమేమి కాదు. పార్టీ ఖర్చులు కోసం జనసేన సరికొత్తగా విరాళాలు అడగటం స్టార్ట్ చేసింది. “నవ సమాజ నిర్మాణం కోసం, యువతరాన్ని రాజకీయాల వైపు నడిపించేందుకు వచ్చిన జనసేనకు ఆర్ధికంగా తోడ్పాటు అందిద్దాం, స్వచ్ఛమైన రాజకీయాలతో వ్యవస్థ మార్పుకు స్వాగతం పలుకుదాం. వంద రూపాయలు జనగణ మన అని జపించి జనసేన ఖాతాలో జమచేద్దాం. మన భవిష్యత్తుని మనమే బలపరుచుకుందాం ” అంటూ జనసేన నుండి ఒక్క ట్విట్ వచ్చింది. విశేషమేమిటంటే జనసేన అధికారిక ఖాతా నుండి కాకూండా ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నవిభాగం శతఘ్ని నుండి పోస్ట్ చేశారు.సరే వంద రూపాయలు వేయమని అడిగారు, తప్పులేదు నచ్చినోళ్ళు వేస్తారు, లేకపోతే లేదు. కానీ జన గణ మన అని జపిద్దాం అనే మాటలు ఎందుకు ఉపయోగించినట్లో, జన గణ మన జనసేన ప్రాస బాగుందని వాడినట్లు ఉంది. అయిన డబ్బులు లేవని మాట్లాడే పవన్ కళ్యాణ్ ప్రవైట్ ఫ్లైట్స్ వేసుకొనిమరీ ప్రయాణాలు చేయటానికి పైసలు ఎక్కడ నుండి వచ్చాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. అలాగే పవన్ కళ్యణ్ తానా సభలకి కూడా నిధుల కోసమే వెళ్లినట్లు ఉన్నాడంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *