Politics

జేడీ గవర్నర్ తో భేటీ వెనుక భారీ వ్యూహం

చంద్రబాబు నాయుడు పై కేంద్ర సర్కార్ ఉక్కుపాదం మోపాలనుకున్నారు. ఆపరేషన్ గరుడ లో భాగంగా ఏపీలో అనిశ్చిత వాతావరణం నెలకొల్పాలని ప్రయత్నం చేశారు. కానీ దానిని ముందే పసిగట్టిన చంద్రబాబు ఎక్కడికక్కడ భగ్నం చేశారు. ఇక కుల గొడవలు రేపు అనుకున్నారు. చంద్రబాబు వాటికి చెక్ పెట్టాడు. కేంద్ర సంస్థలతో దాడులు చేయించి భయాందోళనకు గురి చేయాలనుకున్నారు. కానీ బాబు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. తిరుమలలో కూడా శబరిమల లాగా అశాంతి సృష్టించాలని అనుకున్నారు… ఇక అందులోనూ ఫెయిల్ అయ్యారు. ఒకపక్క జగన్ ను , మరోపక్క పవన్ ను రోజుకో రకంగా ట్రైన్ చేస్తూ చంద్రబాబు మీద ఉసిగొల్పారు. కానీ చంద్రబాబు ఎక్కడికక్కడ ప్రతి పక్ష నేతలకు చెక్ పెట్టాడు. ఇక చివరకు ప్రతిపక్ష నేత పై హత్యాయత్నం అంటూ కోడి కత్తి డ్రామాకు తెరతీశారు. ఇక దానికి కూడా చంద్రబాబు దీటుగా సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఏపీ తో సంబంధం లేని తెలంగాణ సీఎం కేసీఆర్ ను చంద్రబాబు మీద దాడి చేసేలా రెచ్చగొట్టారు. ఇక చంద్రబాబు కెసిఆర్ కూడా గిఫ్ట్ లు ఇవ్వడం మొదలుపెట్టారు.అవినీతి బురద చల్లాలి అనుకున్నారు. కానీ బాబు ఎవరికీ అంత అవకాశం ఇవ్వలేదు. ఏపీ ప్రజల కోసం నిబద్ధత ఉన్న నాయకుడిగా కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఏపీని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లడం కోసం చాలా కష్టపడ్డారు.

ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపించడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. ఇంత కాలం చంద్రబాబు పడిన కష్టం చూసిన ప్రజలు చంద్రబాబు కి జై కొడుతున్నారు. ఇక ఆయన అంతగా ఉన్న వనరులతోనే సృష్టించిన సంపదతో ప్రజల కోసం మెరుగైన పథకాలు అందిస్తున్నారు. ఇక అందరూ వచ్చి బాబు మీద ముప్పేట దాడి చేసిన బాబు మాత్రం తనకున్న విజన్ తో, అభివృద్ధి లక్ష్యంతో, ప్రజల సహకారంతో వాటన్నింటినీ తిప్పి కొడుతున్నారు. దీంతో చంద్రబాబు ముందు ఎవరు నిలబడలేం అటువంటి పరిస్థితి వచ్చింది. జగన్, పవన్, మోడీ ఇప్పుడు తాజాగా కెసిఆర్ ఎందరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా చంద్రబాబు చరిష్మా ముందు వారి ఎత్తులు అన్ని చిత్తవుతున్నాయి . ఇక ఆయన తెలివితేటలు ముందు వీరు చేస్తున్నదంతా బలాదూర్ అనిపిస్తుంది.ఏం చేసినా చంద్రబాబు ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అన్న బాధలో ఉన్న ఢిల్లీ పెద్దలు రానున్న ఎన్నికల నేపథ్యంలో తాజాగా ఏపీ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మరో కుట్రకు తెర లేపుతున్నారు. ఇక ఈసారి ఇలాంటి అవినీతి జగన్, అసమర్ధ పవన్, అహంకారి కేసీఆర్ కాకుండా, బాగా నిజాయితీ ఉన్న అధికారిక గుర్తించబడిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను చంద్రబాబుపై పోరాటానికి దించాలని కొత్త స్కెచ్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ గవర్నర్ నరసింహన్ ను కలిసి మాట్లాడారు. మీడియా కంట పడకుండా నరసింహన్ తో లక్ష్మీనారాయణ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు మాజీ జేడీ లక్ష్మీనారాయణ గవర్నర్ ను ఎందుకు కలిశారు. గవర్నర్తో ఏం మాట్లాడారు అన్నది ప్రస్తుత ఏపీ లో హాట్ టాపిక్.

లక్ష్మీనారాయణ బిజెపి సహకారంతోనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఏపీ రాజకీయాల్లోకి వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పటివరకు ఏ పార్టీలోనూ చేరకుండా మీనమేషాలు లెక్కిస్తున్న ఆయనకు వచ్చే ఎన్నికలకు సంబంధించి ఒక వ్యూహం కచ్చితంగా ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్ ను కలవడం చర్చకు కారణమవుతోంది. ఇక కేంద్రం తాజాగా తీసుకున్న ఈ బిసి రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ఇవ్వాలని చంద్రబాబు చెప్పడం, అదేవిధంగా కాపు రిజర్వేషన్ అంశంపై బీజేపీ స్టాండ్ ప్రకటించాలని కాపు రిజర్వేషన్ బిల్లు కూడా లోక్సభలో ప్రవేశపెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేయటం, కొంతకాలంగా ఏపీ లో జరుగుతున్న పరిణామాలతో కాపు సామాజిక వర్గం టిడిపివైపు చూడడం, ఇక కాపు ముఖ్య నేత రాధా టిడిపిలో చేరడం వంటి అంశాలు రాష్ట్రంలో టీడీపీకి పాజిటివ్ గా వస్తుంది అన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇక పవన్ కళ్యాణ్ పై ఆశలు పెట్టుకున్న కాపులు ఇప్పుడు చంద్రబాబు ను పూర్తిగా నమ్మే పరిస్థితి వచ్చింది. దీంతో ఏపీలో మారిన వాతావరణం నేపథ్యంలో జేడీ లక్ష్మి నారాయణ గవర్నర్ నరసింహన్ ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మళ్లీ ఏపీలో ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి వేడిని రంగంలోకి దీంతో పోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో వాతావరణాన్ని చెడగొట్టి అది టీడీపీకి వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద జెడి మరో వారంలో జనసేన పార్టీలో చేరబోతున్నారు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన గవర్నర్తో భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *