Cinema

జెర్సీ మినీ రివ్యూ

హీరో : నాని
హీరోయిన్ : శ్రద్ద శ్రీనాధ్
డైరెక్టర్ : గౌతమ్ తిన్నురి
ప్రొడ్యూసర్ : సూర్యదేవర నాగ వంశీ

ఇంక కథ విషయానికి వస్తే :

ఈ సినిమా లో హీరో నైపుణ్యం ఉన్న క్రికెటర్ ఎలా అయినా భారత జట్టుకి ఆడాలన్నది అతని కల కానీ అతని కల నిజంగానే ఒక కల లాగానే మిగిలిపోయే పరిస్థితి వస్తుంది కానీ 36 ఏళ్ళ వయస్సులో మల్లి క్రికెట్ బాట్ ని పట్టి ఎలా జీవితంలో విజయాన్ని కుటుంబం లో ఆనందాన్ని తెచ్చుకుంటాడో అన్నది ఈ సినిమా ముఖ్యఉద్దేసం.
ముందుగా నాని నటన అద్భుతంగా ఉంది మరియు హీరోయిన్ కూడా చాలా చక్కగా నటించింది సినిమా లో పాటలు కూడా బాగున్నాయి అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది ముఖ్యంగా చెప్పాలంటే తండ్రి కొడుకుల మధ్య జరిగే ప్రతీ సంభాషణ చాలా అద్భుతంగా చిత్రీకరించాడు డైరెక్టర్.
ఇంటర్వెల్ ముందు మరియు సినిమా క్లైమాక్స్ లో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాడు అంటేనే అర్ధం చేసుకోవాలి ఈ సినిమా డైరెక్టర్ కి డెప్త్ ఉంది అని
ముందు గంటసేపు నాని క్రికెట్ ని కోల్పోయిన జీవితం ఉంటె సెకండ్ ఆఫ్ మొత్తం క్రికెట్ గురించే ఉంటుంది అందుచేత ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులకు ముఖ్యంగా చెప్పాలంటే యువతకి బాగా నచ్చే సినిమా అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *