Politics

మమత కు బిగ్ షాక్ ఇచ్చిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నిర్వహించే యునైటెడ్ ఇండియా ర్యాలీకి హాజరు కావడం లేదా? కాంగ్రెస్ పార్టీతో కలిసి బీజేపీయేతర కూటమి పార్టీలన్నీ ఈ ర్యాలీలో పాల్గొనడమే అందుకు కారణమా? కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ప్రారంభించిన ఫ్రంట్ స్ఫూర్తికి మమత ర్యాలీ విరుద్ధమా? అంటే టిఆర్ఎస్ శ్రేణుల నుండి అవును అనే సమాధానమే వస్తుంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్ అందులో భాగంగా ముందు పశ్చిమబెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ని కలిసారు. ఇక ఆమెతో ఫెడరల్ ఫ్రంట్ యొక్క ఉద్దేశాన్ని చెప్పి ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామ్యం తీసుకోవాలని కోరారు.

కేసీఆర్ చెప్పిన విషయాలను విన్న మమతా బెనర్జీ ఫెడరల్ ఫ్రంట్ లో చేరికపై నిరాసక్తతను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే మమత ని కలిసిన కేసిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడినా మమతా బెనర్జీ మాత్రం ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. దీంతో అక్కడే కెసిఆర్ అంచనాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్ పార్టీతో విభేదించి మమతా బెనర్జీ కేసీఆర్ ఫ్రంట్ లో భాగస్వామ్యం తీసుకుంటుంది అనుకుంటే ఆమె అంత సానుకూలంగా స్పందించకపోవడం కెసిఆర్ కు రుచించలేదు. అందుకే ఇప్పుడు పశ్చిమబెంగాల్లో బీజేపీకి వెన్నులో వణుకు పుట్టించడానికి ఆమె నిర్వహించ తలపెట్టిన ర్యాలీ కి కెసిఆర్ వెళ్లరని తెలుస్తుంది.యునైటెడ్ ఇండియా పేరుతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించే ర్యాలీలో పాల్గొనాలని ఆమె కెసిఆర్ కు ఫోన్ చేశారు. అయితే మమతా బెనర్జీ ఆహ్వానాన్ని కెసిఆర్ తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. ఆమె నిర్వహిస్తున్నటువంటి ర్యాలీలో పాల్గొనేందుకు కెసిఆర్ నిరాకరించారు. బిజెపియేతర పార్టీలతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ర్యాలీలో భాగస్వామ్యం అవుతుంది కాబట్టి తాను పాల్గొనలేనని, ర్యాలీ కు దూరంగా ఉండాలనుకుంటున్నానని కెసిఆర్ చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు దూరంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి అన్న భావనలో ఉన్న కేసీఆర్ కాంగ్రెస్తో కలిసి పనిచేసే బీజేపీయేతర కూటమి ర్యాలీలో పాల్గొనేది లేదని టిఆర్ఎస్ పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఇక ఈ ర్యాలీలో తాను పాల్గొంటున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటన చేశారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటి మీదకు రావడానికి ఈ ర్యాలీ దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో బీజేపీ ని గద్దె దించాలని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై దానికోసం నడుంబిగించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల సీఎంల నే కాకుండా మమతా బెనర్జీ దేశంలోని బీజేపీయేతర పార్టీలన్నింటినీ, సీఎం లను అందరినీ ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా మమత ఆహ్వానించారు. అందరికీ ఆహ్వానాలు పంపారు.ఈ ర్యాలీ ద్వారా బీజేపీకి తమ శక్తిని చూపించాలని మమతా బెనర్జీ భావిస్తున్నారు. అలాగే దేశంలోని ప్రధాన పార్టీలు అందరిని కలుపుకుని పనిచేయాలని మమత భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకున్న మమత ఈ ర్యాలీ ద్వారా దేశంలోని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీజేపీయేతర కూటమి ద్వారా మోడీ, అమిత్ షా లను ఎదుర్కోవాలని మొదటి చంద్రబాబుకు సూచించిన మమతా బెనర్జీ నిర్వహిస్తున్న ర్యాలీకి చంద్రబాబు లీడ్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రాంతీయ పార్టీల నాయకులతో ర్యాలీకి రావాల్సిందిగా చంద్రబాబు సైతం కోరిన పరిస్థితి ఉంది. మొత్తం మీద దేశ రాజకీయాల్లో సరికొత్త రాజకీయపరిణామాలకు మమతా బెనర్జీ నిర్వహిస్తున్న ఈ ర్యాలీ వేదిక కానుంది. ఇక తాజా రాజకీయ పరిస్థితులను బట్టి కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో తృణమూల్ కాంగ్రెస్ చేరదు అనేది పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. అందుకే కెసిఆర్ మమతా బెనర్జీ నిర్వహించే ర్యాలీకి హాజరు కారు అనేది క్లియర్ గా అర్థం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *