Politics

లగడపాటి ఎగ్జిట్ పోల్స్ సర్వే…మహాకూటమిదే విజయం

ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు పొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్‌ పోల్ సర్వేలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన ఒక్కసారి డిసైడ్ చేశారంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అంత నిక్కచ్చిగా ఆయన సర్వే ఉంటుంది. ఇప్పటికి వరకు పలు రాష్ట్రాల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఆయన బృదం సర్వేలు చేసింది. ‘ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌’ పేరుతో దేశ వ్యాప్తంగా లగడపాటి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఎన్నికల సర్వేల్లో ట్రెండ్‌ సెట్టర్‌, ఆ మాటకొస్తే సర్వేల్లో ఈ టీమ్‌కు ఉన్న ట్రాక్‌ రికార్డు మరెవరికీ లేకపోవడం విశేషం. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పటికీ అందరి దృష్టి తెలంగాణపైనే ఉంది. అయితే తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఓటరునాడిని ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ ఎలా ఒడిసి పట్టుకుంది. ఇలా అనేక సందేహాలు తెలుగు ప్రజలను తొలుస్తున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలను లగడపాటి నివృత్తి చేశారు.

శుక్రవారం ఎన్నికలు ముగిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్‌ఎస్ 35 స్థానాలకే పరిమితవుతుందని, పది సీట్లు అటూ ఇటూ కావచ్చని తేల్చేశారు. గతంలో 68.5 పోలింగ్‌ శాతం ఉందని, ఓటింగ్‌ శాతాన్ని బట్టి ఫలితం మారుతుందని చెప్పానని, ఇప్పటి వరకు దాదాపు 72శాతం పోలింగ్‌ నమోదైందని ఆయన తెలిపారు. ఇండిపెండెంట్లు 8-10, బీజేపీకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా కనిపించిందని, ఎప్పుడూ లేనంతగా డబ్బు ఖర్చు పెట్టారని లగడపాటి తెలిపారు. ఏడుగురు ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉందన్నారు. బీజేపీకి 7 సీట్లకు అటు ఇటు వస్తాయని, టీడీపీ పోటీ చేసిన 12 స్థానాల్లో 2 ఇండిపెండెంట్లు గెలుస్తారని వెల్లడించారు. ప్రజాకూటమికి 65 స్థానాలు వస్తాయని వస్తాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *