Politics

వంగవీటి రాధా టీడీపీలో చేరిక వెనుక ఉన్న కీలక నేత ఈయనే.. పేరు బయటకు

ఏపీ రాజకీయాల్లో వంగవీటి రాధా వైసిపి కి గుడ్ బై చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్. అంతేకాదు కాపు సామాజిక వర్గానికి చెందిన రాధాకృష్ణ జనసేన బాటపడతాడు అనుకుంటే అనూహ్యంగా టీడీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారని తెలుస్తోంది. ఇది విజయవాడ రాజకీయాల్లో మరింత హీట్ పుట్టిస్తోంది. వైసీపీ మాజీ నేత వంగవీటి రాధాకృష్ణ ఎవరు ఊహించని విధంగా వైసిపికి రాజీనామా చేసి టీడీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారు. అయితే నాలుగు నెలలుగా బోలెడన్ని హైడ్రామాలు వైసీపీలో నడుస్తున్న రాజీనామా చేయని రాధాకృష్ణ అకస్మాత్తుగా రాజీనామా చేయడం, వెనువెంటనే టీడీపీలో చేరడానికి సన్నద్ధం కావడం వెనుక టీడీపీకి చెందిన ఒక కీలక నాయకుడు చక్రం తిప్పారని టాక్ నడుస్తోంది. ఇక అందరి చూపు రాధాకృష్ణను టిడిపి వైపు తీసుకు వెళుతున్న ఆ నేత ఎవరు అన్నదానిపై పడింది. దేవినేని కుటుంబంతో వైరుధ్యం ఉన్న నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరరు అని జనసేన లో చేరుతారని ప్రచారం జరిగింది. అయినా అదంతా పక్కనపెట్టి రాధాకృష్ణ టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకోవడం వెనుక టిడిపి నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పాత్ర ఉంది. ఇక అసలు విషయానికొస్తే పార్టీలు వేరైనా వంగవీటి రాధాకృష్ణ, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ ముగ్గురు ప్రాణ స్నేహితులు. చాలా సన్నిహితంగా కలిసిమెలిసి ఉండేవారు.ఇక కొడాలి నాని జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న రాధా కృష్ణ ను ఎప్పటికప్పుడు పార్టీ మారకుండా బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇక వల్లభనేని వంశీ రాధాకృష్ణను టీడీపీ లోకి తీసుకురావడానికి బాగా ప్రయత్నించారు. ఇక ఇద్దరు మిత్రుల ప్రపోజల్స్ తో రాధాకృష్ణ ఇంతకాలం కాం గా ఉన్నారు. కానీ వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి తనకు పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యతను ఇవ్వడం లేదని గ్రహించిన రాధాకృష్ణ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక టిక్కెట్ విషయంలో సైతం ఒక క్లారిటీకి వచ్చిన వల్లభనేని వంశీ ప్రపోజల్ కు ఓకే చెప్పారు. వైసిపికి రాజీనామా చేసి టిడిపి తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైపోయారు.పొమ్మనలేక పొగపెడుతున్న వైసీపీని వీడాలనితన తండ్రి రంగా వర్ధంతి రోజునే భావించినప్పటికీ మిత్రుడు కొడాలి నాని వారించడంతో వెనక్కితగ్గారు. అప్పటికి కూడా వైఎస్ జగన్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో చివరికి పార్టీకి రాజీనామా చేశారు. జనసేన లో చేరి ఎమ్మెల్యే గా బరిలోకి దిగాలని భావించిన రాధా మనసు మార్చడంలో వంశీ సక్సెస్ అయ్యారు.

సామాజిక వర్గ సమీకరణాలు, ప్రజలనాడిని బట్టి టీడీపీలో చేరాలని సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు బలమైన సామాజిక వర్గం నేత పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో ఆ సామాజిక వర్గ ఓటుబ్యాంకు కొల్లగొట్ట వచ్చని వల్లభనేని వంశీ చంద్రబాబుతో రాధాకృష్ణ చేరిక గురించి మాట్లాడారు.చంద్రబాబుతో రాధ గురించి చెప్పి ఇద్దరి మధ్య ఆయన రాయబారం నడిపినట్లు బెజవాడ టాక్. ఇక రాధాకృష్ణ లాంటి మాంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ సేవలు టిడిపికి అవసరమని భావించి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక దీంతోనే వల్లభనేని వంశీ రాధాకృష్ణ కు లైన్ క్లియర్ చేసి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. అందుకే రాధాకృష్ణ వైసిపికి రాజీనామా చేసి టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నారు. ఇక కొడాలి నాని రాధాకృష్ణను ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి. వంగవీటి రాధాకృష్ణను టిడిపిలో చేర్పించి వల్లభనేని వంశీ సక్సెస్ అయ్యారు. మొత్తానికి రాధాకృష్ణ వచ్చే ఎన్నికల్లో టిడిపి నుండి బరిలోకి దిగినా, దిగకపోయినా ఆయనకు ఇచ్చే పదవి కూడా ఫైనల్ అయిపోయిందని తెలుస్తోంది. టీడీపీ కీలక నేత చక్రం తిప్పారని అందుకే వంగవీటి రాధాకృష్ణ టిడిపిలో చేరుతున్నారనే వార్తలు హల్చల్ చేసిన నేపథ్యంలో ఇంతకీ ఎవరా నేత అని చూసిన ప్రతి ఒక్కరికి ఆయన మరెవరో కాదు వల్లభనేని వంశీ నే అని తెలియడంతో రాధా చేరిక వెనుక ఉంది వల్లభనేని అని అందరికీ అర్థమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *