Politics

ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ పై నందమూరి సుహాసిని షాకింగ్ నిర్ణయం

నందమూరి సుహాసిని… నందమూరి హరికృష్ణ కుమార్తెగా, ఆయన రాజకీయ వారసురాలిగా ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ముందస్తు ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసిన నాయకురాలు. టిడిపికి కంచుకోటగా ఉన్నటువంటి కూకట్పల్లి నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగి ప్రత్యర్థికి చాలా గట్టి పోటీ ఇచ్చిన సుహాసిని ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. నందమూరి సుహాసిని ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆమెకు ప్రచారానికి తగిన సమయం లేకపోవడం, అప్పటికే పార్టీ నుండి టిక్కెట్ ఆశించి భంగపడినవారు సహకరించకపోవడం, టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన నాయకులు ఆమెను నాన్ లోకల్ గా చిత్రీకరించడం వంటి కారణాలు ఆమె ఓటమికి గల ప్రధాన కారణాలు.

ఇక ఎన్నికల్లో ఓటమి పాలు అయినప్పటికీ తనను ఆదరించి ఓట్లేసిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఆమె కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులోనే ఉంటానని తెలియజేశారు.ఇక సుహాసిని రాజకీయ భవితవ్యంపై రకరకాల ప్రచారాలు చేసిన ప్రత్యర్థి వర్గాల నేతలు కెసిఆర్ సుహాసిని ని తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారని ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి టిడిపిని గట్టి దెబ్బ కొడతారని చెప్పుకొచ్చారు. కూకట్పల్లిలో ఓటమి తరువాత ఇక ఆమె రాజకీయ భవిష్యత్తు శూన్యంగా మారిందని రకరకాలుగా ప్రచారం చేస్తున్న తరుణంలో సుహాసిని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అవకాశం ఇస్తే పార్టీ తరఫున పని చేయడానికి తాను ఎప్పటికీ సిద్ధంగా ఉన్నానని దివంగత నేత నందమూరి హరికృష్ణ తనయురాలు సుహాసిని చెప్పుకొచ్చారు.

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధినేత చంద్రబాబు ఆదేశిస్తే తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోవాలని ఆమె భావిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న సుహాసిని చంద్రబాబు ఆదేశిస్తే ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని సైతం నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం చంద్రబాబు చాలా కృషి చేస్తున్నారని చెప్పిన సుహాసిని టిడిపి విజయం కోసం తాను శక్తివంచన లేకుండా పని చేస్తానని చెప్పి చంద్రబాబుపై, అలాగే పార్టీపై తనకున్న విశ్వాసాన్ని తెలియజేసి ఆమె పై జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టారు. మరి తెలంగాణలో దెబ్బతిన్న నందమూరి ఆడపడుచుకు ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *