Cinema

కండోమ్ ఎలా వాడతారో చూడ‌లేదా..? నవదీప్

రానా దగ్గుబాటి నిర్వహించే నెం. 1 యారీ షో చాలా పాపులర్. తన షోకు వచ్చే సెలబ్రిటీలను.. అతిథులను ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వేస్తూ నవ్వుతూ నవ్విస్తూ రానా చాలా అల్లరి చేస్తాడు. ఇక రానాకు తోడుగా సందీప్ కిషన్ .. నవదీప్ లాంటి అల్లరి బాబులు.. మిల్కీ బ్యూటీ తమన్నా లాంటి అందమైన పాప ఉంటే అల్లరి ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.న‌వ‌దీప్ ఒక‌ప్పుడు హీరోగా న‌టించిన‌ప్ప‌టికి స‌రైన హిట్లు లేక క్యారెక్ట‌ర్ ఆర్టిప్ట్‌గా మారాడు. ఇండ‌స్ట్రీలో నవదీప్ గురించి చాలానే గాసిప్‌లు వ‌చ్చాయి.

తాజాగా నవదీప్ న‌టించిన నెక్ట్స్ ఏంటీ సినిమా విడుద‌ల‌కు రెడీ అవుతుంది. సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా నవదీప్‌తో పాటు, నెక్ట్స్ ఏంటీ హీరో సందీప్ కిష‌న్‌,హీరోయిన్ త‌మ‌న్నాలు హీరో రానా నిర్వ‌హించే ఓ ప్రొగ్రామ్‌కు హాజ‌రైయ్యారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ముగ్గురూ నెం. 1 యారీ షో కు హాజరయ్యారు. ఈమధ్యే రిలీజ్ చేసిన ఈ ఎపిసోడ్ ప్రోమోలో ఫుల్ హంగామా చేశారు. కూలెస్ట్ ఎవరు అని తమన్నా ను రానా అడిగితే ‘యూ’ అని చెప్పింది. స్మార్టెస్ట్ ఎవరు అని అడిగితె మళ్ళీ ‘యూ’ అని చెప్పింది. దీంతో నవదీప్.. “సందీప్.. సరే పద .. మనం బయలుదేరదాం!” అని లేచాడు. ఇంకో బిట్ లో రానా సందీప్ ను “నవదీప్ అండర్ వేర్ బ్రాండ్ ఏంటి?” అని అడిగాడు. దెబ్బకు సందీప్ తెల్లమొహం పెట్టాడు.

ఇంకో బైట్ లో సందీప్ “కండోమ్ ఎలా ఉంటుందో చూద్దామని కొనుక్కున్నాం!” అన్నాడు.. ఈ డైలాగ్ దెబ్బకు అందరి ఫ్యూజులు ఎగిరిపోయి నవ్వుల్లో మునిగిపోయారు. నవదీప్ మాత్రం అసలు కంట్రోల్ లేకుండా నవ్వుతూనే “ఏమో ఎలా ఉందో.. ముగ్గురు అబ్బాయిలు కూర్చుని ఎలా వాడతారో చూద్దాం అనుకున్నారా?” అంతో రాకింగ్ పంచ్ విసిరాడు. ఈ ఎపిసోడ్ మాత్రం మామూలుగా లేదు. మీరూ ఈ ప్రోమో పై ఒక లుక్కేయండి. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రొమోని విడుద‌ల చేశారు.ముందుగా తమన్నా.. రానాని మీరు సింగిలేనా..? అని ప్రశ్నించగా దానికి రానా అవునని చెప్పగా.. పక్కనే ఉన్న నవదీప్ ఎప్పుడూ సింగిలే అని పంచ్ వేశాడు.నవదీప్ అండర్ వేర్ బ్రాండ్ ఏంటి…? అని సందీప్ ని కిషన్ ని రానా ప్రశ్నించగా ఆ సెకన్ లో సందీప్ ఫేస్ ఎక్స్ ప్రెషన్ చూసి అక్కడున్న అందరూ నవ్వారు. మధ్యలో కండోమ్ టాపిక్ రాగా.. సందీప్ కిషన్ ‘కండోమ్ ఎలా ఉంటుందో చూద్దామని ఒకసారి కొన్నాను’ అని చెబుతుండగా నవదీప్.. ‘ఇంకానయం ఎలా వాడతారో చూడ్డామనుకోలేదు’ అంటూ పంచ్ వేశాడు.ప‌క్క‌నే ఉన్న త‌మ‌న్నా ఈ కామెంట్స్‌కు ఏం చేయాలో తెలియక ముసి,ముసి న‌వ్వులు న‌వ్వి ఊరుకుంది.ప్రొమోనే ఇలా ఉంటే ఇంకా షో ఎలా ఉంటుందో అని అంద‌రు ఈ ప్రొగ్రామ్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *