Cinema

కథానాయకుడు దెబ్బకి మహానాయకుడు సినిమాపై బాలయ్య షాకింగ్ నిర్ణయం

మహానటి తర్వాత బయోపిక్ లపై దృష్టిపెట్టిన ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్నో బయోపిక్స్ వస్తున్నాయి. అయితే నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర “కథానాయకుడు” సినిమా ఇటీవలే విడుదలయ్యాక సీన్ మారిందా? అనిపిస్తోంది. రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్ తీసి, తొలిభాగం జనవరి 9న సంక్రాంతి బరిలో నిలిపారు. రెండవ భాగం మహానాయకుడు ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది. నిజానికి నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ ప్రశంసలు అందుకుంది. సినిమా చూసిన వారందరు బాలయ్య బానే చేసాడని, అన్న గారి లాగే ఉన్నాడని పొగిడేశారు కూడా.ఎందుకంటే, తెలుగు సినిమా రంగంలో గొప్ప హీరో అంటే ఇప్పటికి అన్న గారి పేరే చెబుతారు.

అలాంటి అన్న గారు సినిమా రంగంలో ఎన్ని కష్టాలు పడ్డారు ఈ సినిమాలో చక్కగా చూపించారు. కానీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో విజయం అందుకోలేదు. కలెక్షన్స్ పరంగా చూస్తే డిజాస్టర్ అని చెప్పాలి. దీంతో క‌థానాయ‌కుడు ప్ర‌భావం ఇప్పుడు ‘మ‌హానాయ‌కుడు’పై కూడా పడబోతోంది. ఎందుకంటే, రెండవ భాగం సినిమా కొనడానికి బయర్స్ జంకుతున్నారు .విషయం గమనించిన ఈ సినిమా నిర్మాత కూడా అయిన బాలయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మ‌హానాయ‌కుడు’ సినిమా బ‌య్య‌ర్ల‌కు ఫ్రీగా ఇచ్చేస్తున్నార‌నే వార్త‌లు వైరల్ అవుతున్నాయి. అయితే విడుద‌లైన త‌ర్వాత లాభాల్లో వాటా తీసుకోవాల‌నేది నిర్మాత‌ల‌కు, బ‌య్య‌ర్ల‌కు మ‌ధ్య ఒప్పందం మేరకు ఇలా ఉచితంగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతొంది. దీనికి క్రిష్ కూడా ఒకే చెప్పినట్లు టాక్. మరి ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల అయ్యే ‘మ‌హానాయ‌కుడు’ ఎలాంటి టాక్ తెస్తుందో,నిర్మాతను,బయ్యర్స్ ని సేఫ్ జోన్ లో పడేస్తుందో లేదో చూడాలి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *