Cinema

ఓహ్ బేబీ సినిమా తన కెరీర్ బెస్ట్ సినిమా….

చాలా కాలం తరువాత నందిని రెడ్డి దర్శకత్వం లో ఒక కొత్త కథ తో వచ్చింది,సమంత ముఖ్య కథా నాయకురాలిగా కనిపించబోతున్న ఈ సినిమా లో చాలా ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ ఉన్నాయ్ అనే చెప్పుకోవాలి, ముఖ్యంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా గా అందులోను సమంత చాలా విభిన్నమైన నటనతో అందరిని అలరించబోతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు, దీనికి తోడు సినిమా లో నటీనటులు కుడా కరెక్ట్ గా సమకురారు , రాజేంద్ర ప్రసాద్ , రావు రమేష్ , సీనియర్ నటి లక్ష్మి ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు,70 ఏళ్ళ ( లక్ష్మి ) 24 ఏళ్ళ ( సమంత ) గా ఎందుకు మారుతుంది అలా మారడానికి గల కారణాలు ఏంటి, సమంత లా మారిన తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది, 70 ఏళ్ళ ( లక్ష్మి ) కి భర్త గా రాజేంద్ర ప్రసాద్ నటించగా 24 ఏళ్ళ ( సమంత ) కి నాగ సౌర్య నటించడం జరిగింది ఇంకా ట్రైలర్ లో రావు రమేష్ కి బాబయ్య గా రాజేంద్ర ప్రసాద్ వీళ్ళ ఇద్దరి మధ్య జరిగే మాటలు ట్రైలర్ లో మంచి కామెడీ టైమింగ్ ని చూపించాయి ఇంక సినిమా లో ఎంతగా నవ్విస్తారో చూడాలి. ఈ సినిమా లో ఇంకో విషయం ఇంద్ర సినిమా లో నేనున్నా నాయనమ్మ అని చెప్పిన బాబు కూడా ఈ సినిమా లో నటించడం జరిగింది, ట్రైలర్ లో చుస్తే బేబీ కి మనవడు పాత్ర చేస్తున్నట్టు గా ఉంది, ట్రైలర్ లో చివరికి వచ్చే సరికి సెంటిమెంట్ సీన్స్ చూసాం దేనిని బట్టి కామెడీ తో పాటు సెంటిమెంట్ కూడా సమపాళ్లలో ఉంటుంది అని తెలుస్తుంది, ఈ సినిమా హిట్ నందిని రెడ్డి కి చాలా అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *