Politics

పవన్ సంచలన నిర్ణయం – జగన్ పై పోరాటం ప్రారంభం…

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తన పోరాటాన్ని ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాడు. తన పోరాటాన్ని రైతుల సమస్యలనుండి మొదలు పెడతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈమేరకు పవన్కళ్యాణ్ ప్రభుత్వానికి ఒక లేఖని రాశారు. “రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం బాకీ ఉన్న రూ.610.86 కోట్ల సొమ్మును రైతులకు త్వరితగతిన అందించాలి. కేవలం ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనే రూ. 510 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వారిని అప్పులపాలు కాకుండా చూడాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విత్తనాల కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అర్ధరాత్రి వరకూ లైన్లో నుంచున్నా అందే పరిస్థితులు లేవు. ప్రభుత్వ గోదాముల్లో ఉండాల్సిన వేరుశనగ విత్తనాలు ప్రైవేటు గోధాముల్లో ఎందుకుంటున్నాయి? ఉత్తరాంధ్రలో వరి విత్తనాలు లేవు. అనంతపురంలో వేరుశనగ విత్తనాలు 3 లక్షల క్వింటాళ్లకు 1.8 లక్షల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల బకాయిల చెల్లింపు, విత్తనాల కొరత తీర్చడంపై దృష్టి సారించాలి. రైతులు రోడ్డెక్కి ధర్నా చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే” అంటూపవన్ కల్యాణ్ లేఖలో పేర్కొన్నారు.అయితే ఈ లేఖపై ఏపీ ప్రభుత్వం ఎలాగో స్పందించలేదు కానీ.. రైతులసమస్యలు తీర్చకుంటే వారు తెలిపే నిరసనకు ముందునుండి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. కాగా వైఎస్ హయాంలో తూర్పుగోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి అక్కడి రైతులు నిరసన తెలిపారు. ఒకవేళ అలంటి సమస్య ఎదురైతే జగన్ ఎలా ఎదురుకుంటాడో చూడాలని పలువురు రాజకీయ వేత్తలు ప్రశ్నిస్తున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *