Politics

చంద్రబాబు పై సాక్షి జర్నలిస్ట్ కితాబు … సోషల్ మీడియా లో వైరల్

ఏ జర్నలిస్టు కైనా ఉన్నది ఉన్నట్టే వార్త రాయాలనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భావస్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయి. ఎప్పుడైతే రాజకీయాల కోసం ఒక పెద్ద మీడియా సంస్థ ఏర్పాటైందో అప్పటినుండే జర్నలిజం సైతం బ్రష్టు పట్టింది. వాస్తవాల్ని వాస్తవాల కాకుండా వక్రీకరించి రాయడం జర్నలిస్టులు నేర్చుకోవాల్సి వచ్చింది. పొట్టకూటి కోసం మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులు వార్తలు రాసే విషయంలో సదరు మీడియా సంస్థ కొన్న గీతను దాటి బయటకు రాలేక పోతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకమైన వార్తలు తప్ప ఒక్క వార్త కూడా చంద్రబాబు ఇది మంచి పని చేశారు అని ప్రచురితం కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను సైతం వక్రీకరించి దీని వెనక ఏముందో అన్న కోణంలో వార్తలు రాయడం సదరు జగన్ పత్రికకు, ఛానల్ కు మాత్రమే సాధ్యమైంది.ఎప్పుడూ సొంత డబ్బా కొట్టుకోవడం మినహాయించి సదరు పత్రిక చేసేది ఏమీ లేదు. ఇక చంద్రబాబుపైన దాడి చేయమంటే అర్థం పర్థం లేని రాతలతో, జర్నలిజాన్ని పక్కనపెట్టి జగనిజం చూపించే లాగా ఇష్టారాజ్యంగా రాస్తారు.

అది సదరు జర్నలిస్టులకు ఇష్టం లేకున్నా పత్రికాధినేత ఆర్డర్ కాబట్టి తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. రాయాలనుకున్నది పత్రికలో రాయ లేకుంటే మరో చోట ఏదో ఒక రూపంలో రాసి అసలు వాస్తవాలను బయటపెట్టారు ఓ సాక్షి జనలిస్ట్. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబుపై సాక్షి జర్నలిస్టు చేసిన ప్రశంసలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాపం అక్కడ కూడా చంద్రబాబు పేరు రాస్తే ఏం తలనొప్పి వస్తుంది అని చాలా జాగ్రత్తగా మదనపల్లె గ్రామానికి జరిగిన మేలును, గ్రామానికి నీరందించిన సర్కారు తీరును చాలా గొప్పగా రాశారు సాక్షి జర్నలిస్ట్ కుమార మంగళం నేతాజీ.దశాబ్దాల కరువు నేల… కనుచూపు మేర కానరాని వర్షపు నీటి చుక్క…బండబారిన బతుకులు..బతుకు తెరువు కోసం కేరళ లో భిక్షాటన చేస్తున్న అన్నదాతలు…పట్టేడు మెతుకులు కోసం పుణే, ముంబయి వేశ్యవాటికల్లో మగ్గి ఎయిడ్స్ మహమ్మారి కి బలైన మదనపల్లె మారుమూల గ్రామాల మహిళలు.. ఇలా జీవితం పై ఆశ కోల్పోయిన ఎందరో సగటు జీవుల బతుకుల్లో వసంతం నింపేందుకు…. ఎడారి బతుకుల్లో జీవితం పై ఆశలు చిగురింప చేసేందుకు ఆలస్యంగా వచ్చినా వెలకట్టలేని ఆనందాన్ని నింపుతూ బిర బిరా పరుగులెడుతూ…. సోమవారం తెల్లవారుజామున చిత్తూరు జిల్లా లో కి అరుదెంచాయి కృష్ణా జలాలు… మాటలు కరువై పడమటి మండలాల రైతులు ఒక అద్బుతాన్ని తనివితీరా చూస్తున్నారు.. ఆస్వాదిస్తున్నారు…రాజకీయాలు పక్కన పెడితే…ఈ కల ఆలస్యంగా నైనా సాకారం చేసిన కలెక్టర్ ప్రద్యుమున్నా గారికి, ఇరిగేషన్ ఇంజనీరుల కు శతకోటి వందనాలు… కరువు పై 26 సంవత్సరాలుగా ప్రత్యక్షo గా మారుమూల పల్లెల్లో తిరిగి ప్రత్యేక కథనాలు వార్తలు గా ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, సాక్షి, ది హన్స్ ఇండియా లో రాసిన నాకు కరువు నేలను కృష్ణా జలాలు ముద్దాడటం.. చెప్పలేనంత సంతోషం కలిగిస్తోంది అంటూ తన మనసులోని భావాన్ని చాలా చక్కగా రాసిన ఆయన బొంతలపల్లి వద్ద కాలువ లో కి పడుతున్న కృష్ణా జలాల ఫొటోలు షేర్ చేశారు.. ఇట్లు మీ కుమారమంగళo నేతాజీ అంటూ ముగించారు.దశాబ్దాల కరువు నేల జలకళతో తొణికిసలాడుతుంది అని , జిల్లాలోకి కృష్ణా జలాలు అందించాలని, రైతన్నల ఆశలు నెరవేరాలని, ఇది ఒక అద్భుతమని తన మనసులోని అభిప్రాయాన్ని ఏపీ సర్కార్ రైతాంగానికి చేసిన మేలుని చాలా గొప్పగా అభివర్ణించి రాసినటువంటి ఈ ప్రశంస ప్రస్తుతం ఏపీ ప్రజలను ఆలోచించేలా చేస్తోంది. పత్రికలో రాయలేని విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన ఆయనకు తెలుగు తమ్ముళ్లు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ఇక ఇలాంటి వాస్తవాలు ఏపీ లోని ప్రతి జిల్లాలో ఉన్నప్పటికీ పాపం జగన్ మీడియా జర్నలిస్టుల చేతులకు సంకెళ్లు ఉండగా, వాళ్ల కలానికి పరిధులు ఉండగా ఎలా రాస్తారు చెప్పండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *