Politics

అఖిల ప్రియ సంచలనం

కర్నూలు రాజకీయాల్లో మంత్రి భూమా అఖిలప్రియ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. అఖిల ప్రియ పార్టీ మారుతున్నారని జనసేన తీర్థం తీసుకోబోతున్నారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై అఖిలప్రియ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు తాను పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో విజయం సాధించి తన గెలుపును చంద్రబాబుకు కానుకగా ఇస్తానని మంత్రి అఖిలప్రియ చెప్పుకొచ్చారు. తన పార్టీ మారడం లేదని చెప్పినప్పటికీ కూడా అఖిల ప్రియ మీద ఇంకా వివాదాలు చెలరేగుతున్నాయి. ఒకపక్క ఎన్నికల సమీపిస్తుంటే మరోపక్క కర్నూలు టిడిపి రాజకీయాల్లో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒక పక్క చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే మరోపక్క ప్రియ విషయంలో తలెత్తిన వివాదాలు చిరాకు తెప్పిస్తున్నాయి. ఇటీవల అఖిల ప్రియ తన ముఖ్య అనుచరుల ఇళ్లపై పోలీసులు దాడులు చేసి వారిపై పి.డి యాక్ట్ కింద కేసు నమోదు చేశారని పోలీసులపై అలిగారు. అందులో భాగంగా ఆమె తనకు కేటాయించిన గన్ మెన్ లను వెనక్కి పంపించేశారు. పోలీసులు ఈ విషయంలో కలిపిన బ్రతిమిలాడినప్పటికీ ఆమె తన మొండి పట్టు వీడలేదు.


అంతేకాదు అదే సమయంలో కర్నూలులో వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినా ఆ కార్యక్రమాలకు ఆమె హాజరు కాలేదు. దీంతో పార్టీ మారుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అఖిలప్రియ అదంతా అవాస్తవమని పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని, జనసేనలో చేరాల్సిన ఖర్మ తనకు పట్టలేదని తాను టిడిపిలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. అయినా సరే అఖిల ప్రియ మీద జరుగుతున్న ప్రచారంపై మరొకమారు స్పందించిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలోని నేతలు తన పార్టీ మారుతున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇక ఈ విషయంపై చంద్రబాబు నాయుడికి తాను చెప్పదలుచుకున్నది చెప్పానని అఖిల ప్రియ మాట్లాడారు.


అంతేకాదు ఆళ్లగడ్డ నియోజకవర్గం పై తప్పుడు రిపోర్టులు పంపిస్తున్నారని అఖిల ప్రియ మండిపడ్డారు.సొంత పార్టీలోనే తనకు శత్రువులు ఉన్నారని చెప్పిన అఖిలప్రియ పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. తనను టార్గెట్ చేసుకుని కొందరు సొంత పార్టీ నేతలే ఈ విధంగా చేస్తున్నారంటూ అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని చేసినా పార్టీ మారేది లేదని అఖిల తేల్చిచెప్పారు. ఎందుకంటే టిడిపి అధినేత చంద్రబాబు తనకు, తన సోదరునికి చాలా ప్రాధాన్యత నిచ్చారని, చంద్రబాబు లేకుంటే తాము ఇక్కడ ఉండే వారమే కాదని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తమను గైడ్ చేస్తున్నారని చెప్పిన అఖిలప్రియ ఏదైనా సమస్య ఉంటే డైరెక్టుగా సీఎం చంద్రబాబుతోనే మాట్లాడి పరిష్కరించుకుంటామని క్లారిటీ ఇచ్చారు. అంతేగాని పార్టీని వీడి పోయేది లేదంటూ అఖిల ప్రియ తేల్చిచెప్పారు. మరి ఇక ఇప్పటికైనా అఖిల ప్రియ మీద చెలరేగిన వివాదం అవుతుందో లేదో, అంతర్గతంగా ఆళ్లగడ్డ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చంద్రబాబు ఏవిధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *