Sports

టీం ఇండియా సెమీస్ కు మార్గం?

2019 ప్రపంచకప్ లో పరాజయం తెలియని టీం గా టీం ఇండియా వరుసగా ఆరు మ్యాచ్ లలో విజయం సాధించి ఆఖరి మ్యాచ్ లో ఓటమి రుచి చూసింది పోరాడి ఓడిన ఇండియా గత మ్యాచ్ లో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ముందుకు వెళితే తప్ప ఈరోజు జరిగే మ్యాచ్ లో విజయం సాధించలేం, టీం ఇండియా కి మిడిల్ ఆర్డర్ బలంగా లేకపోవడం పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు, రోహిత్ , కోహ్లీ , ధోని ల మీద నమ్మకం వుంటే సరిపోదు కదా మిగిలిన ఆట గాళ్ళు కూడా సరైన ఆటని కనబర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇది ఇలా ఉండగా టీం లో వరుస గాయాల పాలవుతున్న ఆటగాళ్లు కూడా కొంత కలవరపాటుగా చెప్పుకోవాలి, విజయ్ శంకర్ కి కూడా ప్రాక్టీస్ మ్యాచ్ లో బుమ్రా వేసిన యార్కర్ విజయ్ బొటనవేలికి గాయం అవటం వల్ల తరువాత రెండు మ్యాచ్ లు ఆడినప్పటికీ గాయం పెద్దది అయినందున టీం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అతని ప్లేస్ లో టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ అయిన మయాంక్ అగర్వాల్ ని ఎంపిక చేరినట్టు తెలిసింది.సులభంగా సెమిస్ కి వెళ్లి పోతుంది అనుకున్న టీమ్ ఇండియా ఈరోజు జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తే సెమిస్ ఖాయం అయినట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *