Politics

స్పీకర్ గా పోచారం ఎందుకు ఒప్పుకున్నారో తెలిస్తే షాక్ అవ్వటం గ్యారంటీ

నిన్నా మొన్నటి వరకు స్పీకర్ ఎవరు అన్నదానిపై నెలకొన్న ఉత్కంఠకు చెక్ పడింది. ఎవరికి వారు స్పీకర్ పదవికి నో చెప్పడంతో కెసిఆర్ చివరకు ఎవరికి బాధ్యత అప్పగిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. స్పీకర్ గా పని చేస్తే తరువాత వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలవుతారు అన్న సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో అంత పెద్ద హోదా అయినా అందరూ వద్దని చెప్పేశారు. ఈటల రాజేందర్ ను, పద్మ దేవేందర్ రెడ్డి ని, పోచారం శ్రీనివాస్ రెడ్డి ని అడిగిన కేసీఆర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్ లు ససేమిరా అనడంతో చివరకు పోచారం శ్రీనివాసరెడ్డిని ఒప్పించారు. స్పీకర్ గా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారనే సెంటిమెంట్ ఉన్నప్పటికీ పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గా పదవిని చేపట్టడానికి ఎందుకు అంగీకరించారో తెలుసా. పోచారం ఆ బాధ్యత చేపట్టడంపై కేసీఆర్ వ్యూహం కేసీఆర్ కు ఉంటే పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా తనదైన వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది.తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ కు స్పీకర్ ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. ఎవరికి వారు స్పీకర్ పదవి ఇస్తానంటే ఆ పదవి మాకొద్దు మహాప్రభో అంటూ కెసిఆర్ కు విన్నవించుకున్నారు.

రాజకీయాల్లో కొంతకాలం పాటు మనుగడ సాగించాలని కోరుకుంటున్నామని వారి అధినేతకు చెప్పుకున్నారు. ఇక ఎంత వత్తిడి తెచ్చినప్పటికీ ఈటెల రాజేందర్ ఒక దశలో అలిగి వెళ్ళిపోయాడు కానీ స్పీకర్ పదవి చేపట్టడానికి మాత్రం ఆసక్తి చూపించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన సమయంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన ఈటెల రాజేందర్ స్పీకర్ పదవిని వేరే ఎవరికైనా ఇవ్వాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక పద్మా దేవేందర్ రెడ్డి సైతం ఈసారి కేబినెట్లో స్థానం ఇవ్వమని కెసిఆర్ ని కోరినట్లుగా తెలుస్తోంది.ఇక ఈ నేపథ్యంలోనే పోచారం శ్రీనివాసరెడ్డిని ఒప్పించడానికి కెసిఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కి 70 ఏళ్ల వయసు వచ్చింది. ఇక ఆయన కూడా ఆయన కుమారుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపాలని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న జరిగిన ముందస్తు ఎన్నికల్లోనే తన కుమారుడికి అవకాశమివ్వాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి కెసిఆర్ ను కోరారు. అయితే కేసీఆర్ ఈసారికి పోచారం నే పోటీ చేయాలని సూచించిన నేపథ్యంలో కీలక పదవి లభిస్తుందని వయసు సహకరించకున్నా పోచారం ఎన్నికల బరిలో నిలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో కుమారుని పోటీ చేయించాలనే ఆలోచన ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డిని కెసిఆర్ తన వ్యూహంతో ఒప్పించగలిగారు.

వచ్చే ఎన్నికల్లో ఎలాగూ పోటీ చేసే ఆలోచన లేదు కాబట్టి అత్యంత గౌరవ ప్రదమైన స్పీకర్ పదవిని స్వీకరించాలని కెసిఆర్ పోచారం ని కోరారు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడి రాజకీయ భవిష్యత్తును తానే స్వయంగా చూసుకుంటానని సీఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దాలని కుమారుడి విషయాల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి కి సలహా ఇచ్చారు కేసీఆర్. ఇక పోచారం కోరుకున్నట్టు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆయన కుమారుడికి ఇవ్వనున్నట్లు గా తెలుస్తోంది.తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ రెండోసారి శాసనసభలో ప్రధాన భూమిక పోషించనుంది. కానీ గతంలో స్పీకర్ గా పనిచేసిన సిరికొండ మధుసూదనాచారి ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం కెసిఆర్ చాలా ప్రయత్నం చేశారు. పోచారం కుమారుడి రాజకీయ భవిష్యత్తు పై ఆశ చూపించి సీనియర్ అయిన పోచారం శ్రీనివాసరెడ్డిని ఇంటికి పిలిపించి బుజ్జగించి మరీ స్పీకర్ గా పని చేయడానికి ఒప్పించారు. ఎన్నికలకు ముందే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇక తాను రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకుంటానని, తన కుమారుడికి లైఫ్ ఇవ్వమని, బాన్సువాడ టిక్కెట్ కేటాయించమని సీఎం కేసీఆర్ ని కోరారట.

అందుకే పోచారం శ్రీనివాస్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖంగా లేరనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ చేయాలని ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా ఈ ఐదేళ్లు నియోజకవర్గంలో కుమారుని నాయకుడిగా చెయ్యాలని సలహా ఇచ్చారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన నేపథ్యంలోనే పోచారం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరు. అందరూ సెంటిమెంట్ గా భావించే స్పీకర్ గా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయరు కాబట్టి ఓడిపోతారు అనే బాధ లేదు. అందుకే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ గా పని చేయమని అడిగితే కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వమని కోరి సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయన స్థానంలో కుమారుడిని రంగంలోకి దింపనున్నారు. రిటైర్మెంట్ కి దగ్గర పడిన కారణంగానే పోచారం శ్రీనివాస రెడ్డి కి స్పీకర్ గా బాధ్యతలు అప్పగించి ఊపిరి పీల్చుకున్నారు సీఎం కేసీఆర్. మొత్తానికి ఎవరు ఒప్పుకొని స్పీకర్ పదవిని నిర్వర్తించడం కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకోవడం వెనుక ఇంత పెద్ద కథ ఉందని ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *