Cinema

టాలీవుడ్ లో అత్యంత ధనవంతులైన హీరోలు వీరే…. ఎన్ని కోట్లు ఉన్నాయో చూడండి

తెలుగు సినిమా రేంజ్ ఒకప్పుడు వేరు,ఇప్పుడు వేరు, హిందీ తర్వాత అత్యధిక కలెక్షన్స్ కొల్లగొడుతున్న సినీ పరిశ్రమ టాలీవుడ్. అంతేకాదు తెలుగు హీరోలు చాలా తెలివైన వారని కూడా అని తేలింది. ఎందుకంటే ఓ పక్క హీరోగా వేస్తూ మరోపక్క ప్రొడక్షన్ హౌస్ లు రన్ చేస్తూ, యాడ్స్ చేస్తూ రెండు చేతులా రాబడి తెచ్చుకుంటున్నారు. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా సినిమా సినిమాకి పెరిగిపోతోంది. అందుకే హైలెవెల్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. అంతేకాదు సినిమా హిట్ కొడితే,లాభాల్లో వాటా కూడా లాగేస్తున్నారు.ఇక కొందరు హీరోలకైతే భార్యల సంపాదన కూడా తోడవుతోంది.

సెలబ్రిటీల ఆస్తిపాస్తులు,ఆదాయాల గురించి ఎక్కువగా ఫోకస్ చేసే, ఇంటర్ నేషనల్ మాగ్జైన్ ఫోర్బ్స్ అత్యధిక ఆదాయం పొందుతున్న తెలుగు హీరోల సంగతి తేల్చేసింది. మొత్తం మీద రిచ్చెస్ట్ హీరోలుగా కొనసాగుతున్న వారి జాబితా కూడా ఎక్కువే ఉంది. వాళ్ళ దగ్గర ఎన్నేసి కోట్లున్నాయో తెలిస్తే షాకవుతారు.మొదటగా కింగ్ నాగార్జున ను తీసుకుంటే, హ్యాండ్సమ్ హీరోగా అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ మన్మధుడికి హైదరాబాద్ నగరంలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈయన ఆస్తుల విలువ మూడువేల కోట్ల పైమాటే. అన్నపూర్ణ స్టూడియోలో సహా తండ్రి నుంచి చాలా ఆస్తులు కూడా వాటాగా వచ్చాయి.ఇక అల్లు రామలింగయ్య మనుమడిగా, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా అల్లు అర్జున్ బిజీ హీరోగా ఉన్నాడు. తండ్రి అరవింద్ నుంచి,భార్య స్నేహారెడ్డి నుంచి వచ్చిన ఆస్తులను లెక్కకడితే మూడువేల కోట్లు దాటిపోయాయి.

ఇక టివి యాడ్స్ తో ప్రతియేటా కోట్లాది ఆదాయం పొందుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ విషయానికి వస్తే,తండ్రి చిరంజీవి ని మించిన ఆస్తులను సమకూర్చుకున్నాడు. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఉంటూనే బిజినెస్ లో కూడా యమ బిజీగా దూసుకుపోతున్నాడు. అపోలో హాస్పిటల్ చైర్మన్ మనవరాలిని పెళ్ళాడి తన ఆస్తుల విలువ 2,800 కోట్లకు పెంచుకున్నట్లు తెలుస్తోంది.కాగా నందమూరి వారసుడు, హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ మొదట్లో సాదాసీదాగా ఉన్నా , తర్వాత కుటుంబ ఆదరణ పెరగడంతో ఆస్తులు కూడా సంక్రమించాయి.తక్కువ సమయంలో కోట్లకు పడగలెత్తిన తారక్ అత్యధిక ధనవంతుల జాబితాలో చేరిపోయాడు. స్టూడియో ఎన్ అధినేత కుమార్తెతో పెళ్లయ్యాక తారక్ ఆస్తులు వెయ్యికోట్లకు చేరాయని అంటున్నారు.ఇక మంచు విష్ణు విషయంలోకి వస్తే,మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మోహన్ బాబుకి ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది. అందుకే మంచు వారి వారసుడిగా విష్ణు అత్యంత ధనవంతుల జాబితాలో చేరాడు. హీరోగానే కాదు విద్యా సంస్థ ల అధిపతిగా కూడా కోట్లు గడిస్తున్నాడు. వైస్సార్ కుటుంబానికి చెందిన వెరోనికాతో వివాహమయ్యాక 700కోట్లకు ఆస్తుల విలువ చేరినట్లు అంచనా. వీళ్ళే కాదు మహేష్ బాబు,దగ్గుబాటి వెంకటేష్,పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *