Cinema

ఆసుపత్రిలో వెంకటేష్

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు , అవును విశాఖపట్టణం లోని నేచురల్ క్యూర్ ఆసుపత్రిలో వెన్ను నొప్పికి చికిత్స తీసుకుంటున్నాడు . ఇటీవలే ఎఫ్ 2 తో సంచలన విజయం అందుకున్నాడు వెంకటేష్ . 59 సంవత్సరాల వెంకటేష్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు దాంతో ఆ చికిత్స కొసం వైజాగ్ వెళ్ళాడు . అక్కడే ట్రీట్ మెంట్ తీసుకొని అది నయం అయ్యాక హైదరాబాద్ తిరిగి రానున్నాడు .విశాఖపట్టణం లో కూడా రామానాయుడు స్టూడియో ఉన్న విషయం తెలిసిందే . హైదరాబాద్ తో పాటుగా విశాఖపట్టణం లో కూడా రామానాయుడు స్టూడియో ని కట్టాడు . అయితే ఆమధ్య వచ్చిన హుదుద్ తుఫాన్ వల్ల కొంత నష్టం జరిగినప్పటికీ మళ్ళీ పునర్నిర్మించారు . ఎఫ్ 2 తో గ్రాండ్ సక్సెస్ కొట్టిన వెంకీ మరిన్ని సినిమాల కోసం రెడీ అవుతున్నాడు .’ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమా లో ఒక ప్రస్టేటెడ్ భర్త పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం వెంకీ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా ప్రమోషన్స్ లో తన వైవాహిక జీవితం గురించి మాట్లాడారు వెంకీ. మొట్టమొదటిసారిగా ఆయన భార్య గురించి మాట్లాడుతూ “ఆవిడతో జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమె నా పక్కన ఉంటే నేను రెచ్చిపోతాను. మా ఆవిడ నా పక్కనుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది.” అని చెప్పారు. అంతే కాక, “ప్రతి ఒక్కరికి భార్య పక్కన ఉంటేనే ఎనర్జీ వస్తుంది అని నేను నమ్ముతాను. ప్రతి రోజు సాయంత్రం నా భార్యకు నేను కొంత సమయాన్ని కేటాయిస్తాను. ఆ సమయంలో మేము మాట్లాడుకుంటాం, కలిసి భోజనం చేస్తాము లేదంటే రెస్టారెంట్ కు వెళతాం” అని కూడా చెప్పుకొచ్చాడు వెంకీ. మామూలుగా అయితే భార్య ఇంట్లో లేకపోతే భర్త రెచ్చిపోతాడని అందరూ అంటారు కానీ తనకు మాత్రం తన పక్కన భార్య ఉంటే చాలు అంటున్నాడు ఈ సీనియర్ హీరో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *