Cinema

2018 చివరకు కింగ్ ఎవరో తేలిపోయింది

ఎవరికైనా మంచి చెడు రెండూ జరుగుతుంటాయి. ఒక్కో ఏడాది ఒక్కొక్కరికి స్టార్ అందుకుంటుంది. మరికొందరికి పరిస్థితిలో మార్పు ఉండదు. సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. ఒక్కో ఏడాది హిట్ చిత్రాలు ఎక్కువ ఉంటాయి. ఒక్కోసారి అన్నీ బోల్తా కొట్టేస్తాయి. పదుల సంఖ్యలో సినిమాలు వచ్చినా, హిట్స్ అనేవి సింగిల్ డిజిట్ దాటదు. ఇక 2018చూస్తే, ప్రారంభం తుస్సు మంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి డిజాస్టర్ కాగా,నందమూరి బాలయ్య నటించిన జయసింహ ఏవరేజ్ గా నిల్చింది.రామ్ చరణ్ నటించిన రంగస్థలంతో టాలీవుడ్ లో ఈ ఏడాది హిట్ నమోదైయింది.

వరల్డ్ వైడ్ గా 200కోట్ల గ్రాస్ వసూలు చేసి,నెంబర్ వన్ మూవీగా నిల్చింది. వేసవిలో ఆ సినిమా తర్వాత మహానటి సెన్షేషనల్ హిట్ కొట్టింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను మూవీ కూడా మంచి సక్సెస్ అయింది. ఇక అర్జున్ రెడ్డి తర్వాత అదే రేంజ్ లో సినిమాలు మొదలయ్యాయి.ఇక రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ ఎక్స్ 100యూత్ ని కనెక్ట్ అయ్యేలా ఉండడంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కార్తికేయ, పాయల్ రాజపుట్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ కేవలం 3కోట్లతో నిర్మించారు. 20కోట్ల వరకూ షేర్ వసూలు చేసింది. భారీ లాభాలను తెచ్చిపెట్టింది.కాగా విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం మూవీ రిలీజ్ కి ముందే పైరసీ బారిన పడింది. అయితే ఈ రేంజ్ లో హిట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. కేవలం 15కోట్లతో నిర్మించిన ఈ మూవీ వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

పరశురామ్ డైరెక్షన్ లో విజయ్ పక్కన రష్మిక నటించిన ఈ చిత్రం పెద్ద చిత్రాలను సైతం తలదన్నేలా బాక్సాఫీస్ దగ్గర ఇరగదీసింది. కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను మూవీ ఏప్రియల్ 20న రిలీజ్ అయి, మహేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.వరల్డ్ వైడ్ గా 150కోట్లు గ్రాస్ వసూలు చేసి, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద్ సమేత వీర రాఘవ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ నిజంగా మాయ చేస్తూ,నాన్ బాహుబలి రికార్డులను చెరిపేసింది. వసూళ్ల సునామీతో వరల్డ్ వైడ్ గా 158కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. త్రివిక్రమ్ , జూనియర్ ఎన్టీఆర్ తొలి కాంబినేషన్ బంపర్ హిట్ కొట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *