Cinema

యష్ మాస్టర్ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన సుధీర్, ప్రదీప్!

కర్ణాటక లోని హుబ్లీ ప్రాంతానికి చెందిన యశ్వంత్ చిన్నప్పటి నుండి డాన్స్ పై మంచి ఆసక్తి ఉండేది. అయితే తాను కాలేజీ చదువుతున్న రోజుల్లో ఒకరోజు అతను ఒక పాటకు వేసిన డాన్స్ చూసి షాక్ అయిన క్యాట్ అనే డాన్స్ మాస్టర్ యశ్వంత్ ని తన డాన్సింగ్ అసిస్టెంట్ గా తీసుకున్నారు. ఇక ఆపై మెల్లగా అతనికి ఈటీవీ వారి డాన్సింగ్ షో ఢీ లో అసిస్టెంట్ గా పనిచేసి అవకాశం రావడం, ఆతరువాత అదే షోకి తాను కూడా కొరియోగ్రాఫర్ గా ఒక టీమ్ ని రూపొందించడం జరిగిపోయాయి. ఇక అక్కడినుండి ఈటివి వారు నిర్వహించిన ఢీ జోడి, ఢీ జూనియర్స్ ప్రోగ్రామ్స్ లో విజేతగా నిలిచారు యశ్వంత్.

అంతేకాక ఇటీవల జరిగిన ఢీ 10 ప్రోగ్రాం లో రన్నరప్ గ నిలిచిన యశ్వంత్ అక్కడినుండి అందరికి యాష్ మాస్టర్ గా సుపరిచితమయ్యాడు. ఇకపోతే ఇటీవల సమంత ప్రధాన పాత్రలో నటించిన యూటర్న్ సినిమా లోని మాంటేజ్ సాంగ్ కు డాన్స్ కంపోజ్ చేసిన యాష్ మాస్టర్, అనేకమంది ప్రముఖులు అభినందనలు కూడా పొందాడు. ఇక ప్రస్తుతం యాష్ మాస్టర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రేక్షకులకు తెలిపాడు. అంతేకాక ఇటీవల జరిగిన తన ఎంగేజ్మెంట్ తాలూకు ఫోటోలు కూడా విడుదల చేసాడు. ఇక ఇది చూసిన ఢీ జోడి యాంకర్లు ప్రదీప్, సుదీర్ లు, అందరికి పెళ్లిళ్లు అయిపోతున్నాయి మనకు మాత్రం పెళ్లి అవడం లేదంటూ కొంత సెటైరికల్ గా వ్యాఖ్యానించారట.

నిజానికి సుధీర్ కు చాలాకాలం నుండి యాంకర్ రష్మీతో రహస్యంగా ప్రేమాయణం సాగుతోందని పలు మీడియా వర్గాల్లో వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. అయితే తామిద్దరి మధ్య ఏమి లేదని, వారిద్దరూ పత్రికాముఖంగా స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికీ కూడా అవి ఆగలేదు. ఇక మరోవైపు యాంకర్ ప్రదీప్ ఇటీవల తన పేరిట పెళ్లి చూపులు అనే పాపులర్ షో చేసిన విషయం తెలిసందే. ఇక ఆ షోలో కొందరు అమ్మాయిలను ఎంపికచేసి వారిలో చివరకు విజేతగా నిలిచినా అమ్మాయిని ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడు అంటూ షోని నడిపారు. అయితే చివరకు విజేతగా నిలిచిన జ్ఞానేశ్వరి అనే అమ్మయిని ప్రదీప్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడంతో షోపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇక ప్రస్తుతం వీరిద్దరూ యాష్ మాస్టర్ పై ఇలా సరదాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *